రిలయన్స్‌ డిఫెన్స్‌ పేరు మార్పు | Reliance Defence to change name to Reliance Naval and Engineering Ltd | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ డిఫెన్స్‌ పేరు మార్పు

Published Thu, Aug 17 2017 12:58 AM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM

రిలయన్స్‌ డిఫెన్స్‌ పేరు మార్పు

రిలయన్స్‌ డిఫెన్స్‌ పేరు మార్పు

కొత్త పేరు రిలయన్స్‌ నేవల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌  
న్యూఢిల్లీ: రిలయన్స్‌ డిఫెన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (ఆర్‌డీఈఎల్‌) సంస్థ పేరు మార నుంది. రిలయన్స్‌ నేవల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌గా పేరును మార్చేందుకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరనున్నట్లు సంస్థ తెలిపింది. భారత నౌకాదళం, కోస్ట్‌ గార్డ్‌ దళాలకు అందించే సర్వీసులకు అనుగుణంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఆగస్టు 22న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకోసం వాటాదారుల అనుమతి తీసుకుంటా మని పేర్కొంది. ఆర్‌డీఈఎల్‌ గతంలో పిపావవ్‌ డిఫెన్స్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ పేరుతో ఉండేది. 2016లో పిపావవ్‌ డిఫెన్స్‌లో కీలక వాటాలు కొనుగోలు చేసిన తర్వాత రిలయన్స్‌ గ్రూప్‌.. ఈ సంస్థ పేరును ఆర్‌డీఈఎల్‌ కింద మార్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement