
ముంబై: ఈ ఏడాది టాప్–250 గ్లోబల్ రిటైలర్ల జాబితాలో రిలయన్స్ రిటైల్ స్థానం పొందింది. 189వ స్థానంలో నిలిచింది. ‘రిలయన్స్ తన ఎఫ్‌ఎంసీజీ విభాగం నుంచి బలమైన అమ్మకాలు రాబట్టింది. 2015–16లో కంపెనీ రిటైల్ ఆదాయంలో 59.2 శాతం మేర వృద్ధి కనిపించింది’ అని డెలాయిట్ గ్లోబల్ తన ‘గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్’ నివేదికలో పేర్కొంది.
టాప్–250 గ్లోబల్ రిటైలర్లు సంయుక్తంగా 2016 ఆర్థిక సంవత్సరంలో 4.4 ట్రిలియన్ డాలర్ల ఆదాయం పొందాయని తెలిపింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అనుబంధ సంస్థనే రిలయన్స్ రిటైల్. ఆదాయం పరంగా చూస్తే భారత్‌లో ఇదే అతిపెద్ద రిటైలర్.