ఫ్రెంచ్ కారు తయారీదారి రెనాల్ట్ సరికొత్త కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ క్యాప్చర్‌ను రూ.9.99 లక్షల నుంచి రూ.13.88 లక్షల రేంజ్‌లో మార్కెట్‌లోకి విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి వచ్చింది. హ్యుందాయ్ క్రిటా, టాటా హెక్సా, మహింద్రా ఎక్స్‌యూవీ500లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రీమియం ఫీచర్లతో బేస్ వేరియంట్‌ను తీసుకొచ్చినట్టు రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సహవాని తెలిపారు.
భారత్‌లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, కేవలం 2017లోనే భారత్‌లో ఎస్‌యూవీ సెగ్మెంట్ 46 శాతం పైకి ఎగిసిందని చెప్పారు. ఎక్కువ ఫీచర్లున్న స్టైలిస్ ఎస్‌యూవీలపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు పేర్కొన్నారు. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్ వంటి 50 ప్రీమియం ఫీచర్లు క్యాప్చర్ కలిగి ఉన్నట్టు సుమిత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment