సన్ ఫార్మా, శామ్‌సంగ్ బయోలాజిక్స్ ఒప్పందం
సోరియాసిస్ ఔషధ తయారీపై 359 కోట్ల డీల్
న్యూఢిల్లీ: దేశీయ ఔషధోత్పత్తుల దిగ్గజం సన్‌ఫార్మా, దక్షిణ కొరియా కంపెనీ శామ్‌సంగ్ బయోలాజిక్స్ మధ్య భారీ తయారీ ఒప్పందం ఒకటి కుదిరింది. సోరియాసిస్ చికిత్సకు వాడే టిల్‌డ్రాకిజుమాబ్ అనే ఔషధాన్ని తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు మంగళవారం సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ కాంట్రాక్టు విలువ రూ. 359 కోట్లని, డీల్‌కు సంబంధించిన ఇతర ఆర్థిక వివరాలు గోప్యమైనవని ఆ ప్రకటన పేర్కొంది. ఒప్పందం ప్రకారం ఔషధ తయారీ కాంట్రాక్టు శామ్‌సంగ్ బయోలాజిక్స్‌కు సన్‌ఫార్మా ఇస్తుంది.