రెండుగా విడిపోతున్న శాంసంగ్‌? | Samsung considers splitting into two | Sakshi

రెండుగా విడిపోతున్న శాంసంగ్‌?

Nov 29 2016 1:04 PM | Updated on Sep 4 2017 9:27 PM

రెండుగా విడిపోతున్న శాంసంగ్‌?

రెండుగా విడిపోతున్న శాంసంగ్‌?

తమ కంపెనీని రెండుగా విడగొట్టాలని ఆలోచనలో ఉన్నట్లు శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రకటించింది.

తమ కంపెనీని రెండుగా విడగొట్టాలని ఆలోచనలో ఉన్నట్లు శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రకటించింది. తన తండ్రి నుంచి పగ్గాలు చేపట్టబోతున్న వారసుడు లీ జే యాంగ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్‌కు విదేశీ పెట్టుబడిదారుల నుంచి తీవ్రంగా ఒత్తిడి ఉంది. ప్రధానంగా అమెరికాకు చెందిన హెడ్జ్ ఫండ్ ఎలియట్ మేనేజ్‌మెంట్ ఈ విషయంలో ముందుంది. తన కార్పొరేట్ పాలనను మెరుగుపరుచుకోడానికి ఒక హోల్డింగ్ కంపెనీ పెట్టి షేర్‌హోల్డర్లకు డివిడెండ్లు పెంచాలని శాంసంగ్‌ను డిమాండ్ చేస్తున్నారు. 
 
బ్యాటరీలు పేలిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా గెలాక్సీ నోట్ 7 ఫోన్‌ను రీకాల్ చేయాల్సి రావడంతో పెను పతనం నుంచి తప్పించుకోడానికి ఈ టెక్ దిగ్గజం నానా తిప్పలు పడుతోంది. తమ కంపెనీని హోల్డింగ్ కంపెనీ, ఉత్పాదక మరియు ఆపరేటింగ్ కంపెనీలుగా విడగొట్టడానికి ముందుగా కనీసం ఆరు నెలల పాటు పరిశీలించాల్సి ఉంటుందని శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. అలా చేస్తే.. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ చైర్మన్‌గా ఉన్న లీ జే యాంగ్‌కు హోల్డింగ్ కంపెనీ ద్వారా మంచి పట్టు వస్తుందని అంటున్నారు. ఈ ఏడాది ఒక్కోషేరుకు డివిడెండును 36 శాతం పెంచనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement