ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ | SEBI Green Signal for Flamingo Travel Retail Ipo | Sakshi
Sakshi News home page

ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

Published Wed, Jul 4 2018 12:35 AM | Last Updated on Wed, Jul 4 2018 12:35 AM

SEBI Green Signal for Flamingo Travel Retail Ipo - Sakshi

న్యూఢిల్లీ: ట్రావెల్‌ రిటైల్‌ ఆపరేటర్, ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డ్యూటీ–ఫ్రీ షాప్స్‌ కూడా నిర్వహిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,600 కోట్లు సమీకరిస్తుందని అంచనా.

ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.2,423 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఈ కంపెనీ అనుబంధ సంస్థ, ఫ్లెమింగో డ్యూటీ ప్రీ షాప్, ముంబై 11.29 లక్షల షేర్లను విక్రయిస్తుంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను ఫ్లెమింగ్‌ ఇంటర్నేషనల్‌(యూకే)లో వంద శాతం వాటాను కొనుగోలు కోసం వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది.  

ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యస్‌ సెక్యూరిటీస్, యాక్సిస్‌ క్యాపిటల్, క్రెడిట్‌  సూసీ సెక్యూరిటీస్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్, క్యాపిటల్‌ మార్కెట్స్‌ సంస్థలు వ్యవహరిస్తాయి. భారత్, శ్రీలంక ట్రావెల్‌ రిటైల్‌ మార్కెట్లలో ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్‌ కంపెనీదే అగ్రస్థానం.

ఈ రంగం నుంచి ఐపీఓకు వస్తున్న తొలి కంపెనీ ఇదే. ఈ కంపెనీ గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి 28 డ్యూటీ ఫ్రీ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. భారత ఉపఖండంతో పాటు అమెరికా, కరేబియన్, యూరప్‌ తదితర మొత్తం 26 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఐపీఓ ఆమోదంతో   ఈ ఏడాది సెబీ అనుమతిచ్చిన ఐపీఓల సంఖ్య 29కు పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement