సాక్షి, బెంగళూర్ : ఎంతోకాలంగా ఊరిస్తున్న వాట్సాప్ ద్వారా చెల్లింపులు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ ద్వారా చెల్లింపులు సాధ్యమైతే దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా ఊపందుకుంటాయి. భారత్‌లో విస్తృత ఆదరణ పొందిన వాట్సాప్ తన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపుల కోసం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతో కలిసి పేమెంట్స్ ఫ్లాట్‌ఫాంకు సన్నాహాలు చేస్తోంది. ప్లాట్‌ఫాం ఇప్పటికే బీటా (టెస్టింగ్) దశలో ఉందని. ఫిబ్రవరి మాసాంతానికి ఇది సిద్ధమవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు బ్యాంకులతో వాట్సాప్ డిజిటల్ పేమెంట్స్ ఫ్లాట్‌ఫాం ఏర్పాటుపై వివిధ దశల్లో కసరత్తు సాగుతోందని ఓ బ్యాంకర్ సైతం ధ్రువీకరించారు. డేటా భద్రతపై తాము సెక్యూరిటీ చెక్స్ నిర్వహిస్తున్నామని బ్యాంకర్ తెలిపారు. ఇంటిగ్రేషన్ ప్రక్రియలో భాగంగా ఈ ప్రోడక్ట్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేముందు ఎంపిక చేసిన యూజర్లతో దీన్ని పరీక్షిస్తామని చెప్పారు. యూపీఐతో వాట్సాప్ ఇంటిగ్రేషన్‌కు ఈ ఏడాది జులైలో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గూగుల్ సహా పలు టెక్నాలజీ కంపెనీలు బ్యాంకులతో నేరుగా లింక్ అయ్యే ఇన్‌స్టాంట్ చెల్లింపుల సేవల్లోకి అడుగుపెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment