స్టాక్స్‌ వ్యూ | Stakes View | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Apr 17 2017 1:57 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

స్టాక్స్‌ వ్యూ

స్టాక్స్‌ వ్యూ

అజంతా ఫార్మా    
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.1,771  ;   టార్గెట్‌ ధర: రూ.2,028

ఎందుకంటే: అజంతా ఫార్మాకు చెందిన దహేజ్‌ ప్లాంట్‌పై అమెరికా ఎఫ్‌డీఏ తొలి తనిఖీ ఈ నెలలోనే విజయవంతంగా పూర్తయింది. ఈ ప్లాంట్‌ నుంచి ఈ కంపెనీ ఒక అండా(అబ్రివియేటెడ్‌ న్యూ  డ్రగ్‌ అప్లికేషన్‌)ను ఎఫ్‌డీఏకు సమర్పించింది. ఈ అండాకు పూర్తి స్థాయి ఆమోదం 12–15 నెలల్లో రావచ్చు.  చాలా ఫార్మా కంపెనీలు  ఎఫ్‌డీఏ నుంచి గట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ కంపెనీకి చెందిన రెండు ప్లాంట్లు ఎఫ్‌డీఏ తనిఖీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం.

  ఎఫ్‌డీఏ విషయమై మధ్య కాలానికి నిబంధనల రిస్క్‌ స్వల్పంగానే ఉండొచ్చు. మలేరియా నిరోధించే ఔషధాల అమ్మకాలు గతంలోలాగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. నిబంధనల అడ్డంకులను ఎదుర్కొంటున్న ఇప్కా సంస్థ ఈ ఔషధాల సెగ్మెంట్లోకి మళ్లీ ప్రవేశించే అవకాశాలు లేకపోవడం, మలేరియా నివారణకు సంబంధించి గ్లోబల్‌ ఫండ్‌కు నిధులు నిలకడగా వస్తుండడం దీనికి ప్రధాన కారణాలు. కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం, ప్రస్తుతమున్న ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతుండడం,

ఎన్‌పీపీఏ(నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ) నిర్దేశించిన ధరల కోత ప్రభావం స్వల్పంగా ఉండడం,  చర్మం, కన్ను, గుండెలకు సంబంధించిన జబ్బుల నివారణ ఔషధాలతో పాటు నొప్పి నివారణ ఔషధాల సెగ్మెంట్‌ అమ్మకాలు కూడా బాగానే ఉండడం,  ఆఫ్రికా మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు నిలకడగా ఉండడం, మంచి అమ్మకాలు సాధించే ఉత్పత్తులను అందించడం, అమెరికా మార్కెట్లో 2–3 ఏళ్లలో కొత్త అండాల కోసం దరఖాస్తు చేయనుండడం.. ఇవన్నీ కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశాలు. మూడేళ్లలో అమెరికాలో అమ్మకాలు 46 శాతం, దేశీయ ఫార్ములేషన్స్‌  విక్రయాలు 20 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం.

గెయిల్‌(ఇండియా)
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.378  ;  టార్గెట్‌ ధర: రూ.440

ఎందుకంటే: అగ్రస్థాయి సహజ వాయు కంపెనీ. గ్యాస్‌ పంపిణీ, గ్యాస్‌ ట్రేడింగ్, గ్యాస్‌  ప్రాసెసింగ్, ఎల్‌పీజీ ఉత్పత్తి, పంపిణీ, పెట్రో కెమికల్స్‌ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.   గెయిల్‌ గ్యాస్‌ అనే పూర్తి అనుబంధ కంపెనీ సీజీడీ వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా, ఇదే వ్యాపారంలో ఉన్న ఇంద్రప్రస్థ గ్యాస్, మహానగర్‌ గ్యాస్‌ కంపెనీల్లో గెయిల్‌కు వాటాలున్నాయి.

 దేశీయంగా నేచురల్‌ గ్యాస్‌ ధరలు తక్కువగా ఉండడం, ఎల్‌ఎన్‌జీ వ్యయాలు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల కంపెనీ గ్యాస్‌ ట్రాన్స్‌ మిషన్‌ వ్యాపారం బాగా ఉండొచ్చని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 100 ఎంఎంఎస్‌సీఎండీ(మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌ పర్‌ డే)గా ఉన్న గ్యాస్‌ అమ్మకాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 106 ఎంఎంఎస్‌సీఎండీగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 112 ఎంఎంఎస్‌సీఎండీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.

   రెండేళ్లలో  గ్యాస్‌ ట్రాన్స్‌మిషన్‌ ఇబిటా 19 శాతం వృద్ధితో రూ.3,096 కోట్లకు,  గ్యాస్‌ ట్రేడింగ్‌ విభాగం ఇబిటా 1,230 కోట్లకు చేరవచ్చని అంచనా. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.806 కోట్ల నష్టాలు వచ్చిన పెట్రో కెమికల్స్‌వ్యాపారం టర్న్‌అరౌండ్‌ అయ్యే అవకాశాలున్నాయి.  దేశీయ నేచురల్‌ గ్యాస్‌కు ధరలు తక్కువగా ఉండడం ఎల్పీజీ వ్యాపార విభాగం  లాభదాయకత మెరుగుపడుతుంది. దేశీయంగా గ్యాస్‌ ఉత్పత్తి పెరుగుతుండడం, ఎల్‌ఎన్‌జీకి డిమాండ్‌ అధికంగా ఉండడం, టారిఫ్‌ల సవరింపు విషయానికి సంబంధించిన కేసులో గెయిల్‌కు అనుకూలంగా తీర్పు రావడం... కంపెనీకి  ప్రయోజనం కలిగించే అంశాలు. రెండేళ్లలో కంపెనీ ఇబిటా 24 శాతం వృద్ధితో రూ.8,115 కోట్లకు, నికర లాభం 29 శాతం చొప్పున చక్రగతి వృద్ధితో రూ.4,920 కోట్లకు  పెరగవచ్చని భావిస్తున్నాం.

Advertisement
Advertisement