న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) తాజాగా భారత్‌లో మొత్తంగా 2 కోట్ల యూనిట్ల వాహనాలను తయారు చేసినట్లు ప్రకటించింది. జపాన్ తర్వాత భారత్‌లోనే ఈ మైలురాయిని అందుకున్నట్లు తెలిపింది.
ఇండియాలో 1983 డిసెంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించామని, 34 ఏళ్ల 5 నెలల కాలంలో 2 కోట్ల యూనిట్ల మైలురాయిని అందుకున్నామని తెలిపింది. జపాన్‌లో ఈ మార్క్‌కు చేరుకోవడానికి 45 ఏళ్ల 9 నెలలు పట్టిందని తెలిపింది. ప్రస్తుతం ఎస్‌ఎంసీకి.. మారుతీ సుజుకీ ఇండియాలో 56.21% వాటా ఉంది.
ఆల్టోనే టాప్..: భారత్‌లో ఆల్టో కార్లను ఎక్కువగా తయారు చేశామని, 2 కోట్ల వాహనాల్లో 31.7 లక్షలు ఇవేనని కంపెనీ తెలిపింది. ఆల్టో తర్వాత ‘మారుతీ 800’ 29.1 లక్షలు, వేగనార్ 21.3 లక్షలు, ఓమ్ని 19.4 లక్షల యూనిట్లు, స్విఫ్ట్ 19.4 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. మారుతీ సుజుకీ ప్రస్తుతం 3 ప్లాంట్లలో 16 మోడళ్లను తయారు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment