Alto
-
అక్కడ చుక్కలు తాకిన మారుతి ధరలు.. ఏకంగా రూ. 21 లక్షలకు చేరిన ఆల్టో
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువులు మాత్రమే కాకుండా కార్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. భారతదేశంలో తక్కువ ధరకే లభించే మారుతి ఆల్టో ధరలకు రెక్కలొచ్చాయి, ఇప్పుడు పాకిస్థాన్‌లో ఆల్టో బేస్ మోడల్ ధర రూ. 21 లక్షలు, కాగా టాప్ మోడల్ రూ. 27 లక్షల వద్ద అందుబాటులో ఉన్నాయి. పాకిస్థాన్‌లో ఇప్పటికే భారీ ధరలను పెంచిన సుజుకి మరో సారి ధరలను అమాంతం పెంచింది. ఈ కారణంగా సుజుకి బ్రాండ్ కార్లు ఏ దేశంలో లేనంతగా పెరిగాయి. భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో బేస్ మోడల్ ధరలు రూ. రూ.3.50 లక్షలు, టాప్ ఎండ్ మోడల్ ధరలు రూ. 5.12 లక్షల వరకు ఉన్నాయి. భారదేశంలో విక్రయించబడుతున్న ఆల్టో ధరలతో పోలిస్తే, పాకిస్థాన్ సుజుకి ఆల్టో ధర సుమారు ఐదు రేట్లు కంటే ఎక్కువ అని స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉన్న కారణంగా అన్ని ధరలు భారీగా పెరుగుతున్నాయి, భారతీయ కరెన్సీతో పోలిస్తే పాకిస్థాన్ కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంది. సుజుకి ఆల్టో కొత్త ధరలు: సుజుకి ఆల్టో విఎక్స్: రూ.2,144,000 సుజుకి ఆల్టో విఎక్స్ఆర్: రూ. 2,487,000 సుజుకి ఆల్టో విఎక్స్ఆర్ ఏజిఎస్: రూ. 137,000 సుజుకి ఆల్టో ఏజీఎస్: రూ. 2,795,000 సుజుకి వ్యాగన్ ఆర్ కొత్త ధరలు: వ్యాగన్ ఆర్ విఎక్స్ఆర్: రూ. 3,062,000 వ్యాగన్ ఆర్ విఎక్స్ఎల్: రూ.3,248,000 వ్యాగన్ ఆర్ ఏజీఎస్: రూ.3,563,000 సుజుకి కల్టస్ కొత్త ధరలు: కల్టస్ విఎక్స్ఆర్: రూ. 3,540,000 కల్టస్ విఎక్స్ఎల్: రూ. 3,889,000 కల్టస్ ఏజిఎస్: రూ. 4,157,000 సుజుకి స్విఫ్ట్ కొత్త ధరలు: స్విఫ్ట్ జిఎల్ ఎమ్‌టి: రూ. 4,052,000 స్విఫ్ట్ జిఎల్ సివిటి: రూ. 4,335,000 స్విఫ్ట్ జిఎల్ఎక్స్ సివిటి: రూ. 4,725,000 సుజుకి రవి కొత్త ధరలు: సుజుకి రవి: రూ. 1,768,000 సుజుకి రవి డెక్: రూ. 1,693,000 సుజుకి బోలాన్ కొత్త ధరలు: బోలాన్ వ్యాన్: రూ. 1,844,000 బోలాన్ కార్గో: రూ. 1,852,000 Pak Suzuki Cars Prices Increased!#pakwheels #paksuzuki #suzuki #carprices #pricehike pic.twitter.com/b0Eikq3mGw — PakWheels.com (@PakWheels) February 20, 2023 -
టాప్‌గేర్‌లో ‘ఆల్టో’...
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ ‘ఆల్టో’ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ వాహనం(పీవీ)గా ఆల్టో అగ్రస్థానంలో నిలిచింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్)విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 24,751 యూనిట్ల ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదేకాలంలో కాంపాక్ట్ సెడాన్ డిజైర్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలవగా.. ఈసారి ఆస్థానానికి ఆల్టో దూసుకొచ్చింది. డిజైర్ 15,915 యూనిట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. 18,224 యూనిట్ల విక్రయాలతో స్విఫ్ట్ రెండో స్థానానికి, 17,944 యూనిట్ల అమ్మకాలతో బాలెనో మూడో స్థానానికి చేరాయి. వ్యాగన్ఆర్ 15,661 యూనిట్లతో 5వ స్థానంలో నిలిచింది. విటారా బ్రెజా 11,613 యూనిట్ల అమ్మకాలతో 6వ స్థానానికి చేరింది. తొలి ఆరు స్థానాల్లో మారుతి సుజుకి వాహనాలే ఉండగా.. హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏడవ స్థానంలోనూ, క్రెటా ఎనిమిదో స్థానంలో, గ్రాండ్ ఐ10 తొమ్మిదో స్థానంలో నిలిచాయి. టాటా మోటార్స్ టియాగో 10వ స్థానానికి చేరుకుంది. -
ఆల్టోను అధిగమించిన స్విఫ్ట్
న్యూఢిల్లీ: అధికంగా అమ్ముడవుతున్న ప్రయాణికుల కారుగా మారుతీ ఆల్టోను తోసిరాజని అదే కంపెనీకి చెందిన స్విఫ్ట్ నిలిచింది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ప్రయాణికుల కారుగా మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన స్విఫ్ట్ రికార్డ్‌ను సాధించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాల పరంగా అగ్రస్థానంలో నిలిచిన మారుతీ ఆల్టో కారు ఈ ఏడాది నవంబర్‌లో 4వ స్థానంలో నిలిచింది. మొత్తం టాప్ టెన్ కార్లలో మొదటి 6 స్థానాలను మారుతీ కార్లే సాధించగా, చివరి నాలుగు స్థానాలను హ్యుందాయ్ సాధించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం... ∙గత ఏడాది నవంబర్‌లో అమ్మకాల పరంగా ఆరో స్థానంలో ఉన్న మారుతీ స్విఫ్ట్ ఈ నవంబర్‌లో మొదటి స్థానానికి దూసుకువచ్చింది. ∙మారుతీ కంపెనికి చెందిన డిజైర్ కారు గత నవంబర్లోనూ, ఈ నవంబర్లోనూ రెండో స్థానంలోనే నిలిచింది. అయితే అప్పటితో పోలిస్తే ఈ నవంబర్‌లో అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ∙ అప్పుడు – ఇప్పుడు కూడా మూడో స్థానాన్ని ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో సాధించింది. ∙ గతంలో నాలుగో స్థానంలో నిలిచిన విటారా బ్రెజా ఈ సారి ఐదో స్థానానికి పడిపోయింది. ∙ గత ఏడాది నవంబర్‌లో 9వ స్థానంలో ఉన్న హ్యుందాయ్క్రెటా ఈఏడాది నవంబర్‌లో ఎనిమిదవ స్థానానికి చేరింది. ∙ గత ఉడాది నవంబర్‌లో 7వ స్థానంలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఈ సారి తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. -
మారుతీ సుజుకీ కార్లపై రూ.70వేల డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెలలో తన మోడల్స్‌పై రూ.70వేల వరకు డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. డిస్కౌంట్ అందించే మోడల్స్‌లో స్విఫ్ట్, ఎర్టిగా, డిజైర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లో నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ చేసే కారు, ఏడేళ్ల కంటే తక్కువ వయసున్నది అవ్వాలి. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ సర్వీసున్న కార్లకు తక్కువ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. కారు అసలు విలువ నుంచి రూ.35 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎర్టిగా.. మారుతీ సుజుకీ ప్రకటించిన ఆఫర్ కింద, ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ రూ.15వేల నగదు డిస్కౌంట్‌తో లభ్యమవుతుంది. డీజిల్ వేరియంట్‌పై రూ.20వేల డిస్కౌంట్ ఉంది. అదేవిధంగా సీఎన్జీ ట్రిమ్‌పై రూ.10వేల డిస్కౌంట్ లభిస్తుంది. మారుతీ సుజుకీ ఎర్టిగా పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.30వేలు, రూ.20వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు కారు వాడిన ఏళ్ల ప్రకారం ఉంటుంది. డీజిల్ వేరియంట్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు రూ.35వేలు, రూ.25వేలుగా ఉన్నాయి. డిజైర్... మారుతీ సుజుకీ డిజైర్(పెట్రోల్) రెగ్యులర్ ఎడిషన్‌పై రూ.20వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది. స్పెషల్ ఎడిషన్‌పై రూ.27వేల డిస్కౌంట్ ప్రకటించింది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు ఉంది. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ వయసున్న కారు అయితే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10వేలకు తగ్గుతుంది. మారుతీ సుజుకి డిజైర్ డీజిల్ వేరియంట్‌పై రూ.10వేల నగదు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు ఆఫర్ చేస్తుంది. స్విఫ్ట్... మారుతీ సుజుకీ స్విఫ్ట్ రెగ్యులర్ పెట్రోల్ ట్రిమ్ వేరియంట్‌పై రూ.20వేల వరకు నగదు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌పై రూ.27వేల తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.20వేల వరకు, ఒకవేళ కారు ఏడేళ్ల కంటే ఎక్కువ వాడి ఉంటే, డిస్కౌంట్ రూ.10వేలు తగ్గిపోతుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్(డీజిల్)పై రూ.10వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు రూ.25వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్టో/ఆల్టో కే10... ఆల్టో పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ.25వేల నగదు డిస్కౌంట్లను మారుతీ సుజుకీ ఆఫర్ చేస్తుంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10 పెట్రోల్ ఎంటీపై రూ.22వేల నగదు డిస్కౌంట్ లభ్యమవుతుంది. ఆల్టో కే10 ఏఎంటీపై రూ.27వేల నగదు డిస్కౌంట్‌ను, అన్ని మోడల్స్‌పై రూ.30వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. -
అమ్మకాల్లో ఆల్టోను దాటిన డిజైర్
న్యూఢిల్లీ: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనంగా దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా కాంపాక్ట్ సెడాన్ కారు డిజైర్ అగ్రస్థానంలో నిల్చింది. ఈ క్రమంలో మారుతీకే చెందిన ఎంట్రీ లెవెల్ చిన్న కారు ఆల్టోను అధిగమించింది. సియామ్ గణాంకాల ప్రకారం జులైలో డిజైర్ అమ్మకాలు 25,647గా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో డిజైర్ విక్రయాలు 14,703 కాగా, అప్పట్లో అయిదో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిల్చింది. మరోవైపు, గత జూలైలో 26,009 విక్రయాలతో నంబర్‌వన్ స్థానంలో నిల్చిన ఆల్టో అమ్మకాలు తాజాగా 23,371కు తగ్గడంతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇక మారుతీకే చెందిన స్విఫ్ట్ మూడో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిల్చింది. విక్రయాలు 13,738 యూనిట్ల నుంచి 19,993 యూనిట్లకు పెరిగాయి. అటు 17,960 యూనిట్లతో బాలెనో నాలుగో స్థానంలో, వాగన్ఆర్ అయిదో స్థానంలో (14,339 వాహనాలు), ఎస్యూవీ విటారా బ్రెజా ఆరో స్థానంలో (14,181 యూనిట్లు) ఉన్నాయి. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా మూడు మోడల్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఎలీట్ఐ20 మోడల్ (10,822 యూనిట్లు), గ్రాండ్ఐ10 (10,775 యూనిట్లు), ఎస్యూవీ క్రెటా (10,423 కార్లు) వరుసగా 7,8,9 స్థానాల్లో ఉన్నాయి. కొత్త కాంపాక్ట్ సెడాన్ కారు అమేజ్‌తో హోండా కార్స్ ఇండియా తొలిసారిగా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. -
భారత్‌లో సుజుకీ 2 కోట్ల కార్లు...
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) తాజాగా భారత్‌లో మొత్తంగా 2 కోట్ల యూనిట్ల వాహనాలను తయారు చేసినట్లు ప్రకటించింది. జపాన్ తర్వాత భారత్‌లోనే ఈ మైలురాయిని అందుకున్నట్లు తెలిపింది. ఇండియాలో 1983 డిసెంబర్లో కార్యకలాపాలు ప్రారంభించామని, 34 ఏళ్ల 5 నెలల కాలంలో 2 కోట్ల యూనిట్ల మైలురాయిని అందుకున్నామని తెలిపింది. జపాన్‌లో ఈ మార్క్‌కు చేరుకోవడానికి 45 ఏళ్ల 9 నెలలు పట్టిందని తెలిపింది. ప్రస్తుతం ఎస్ఎంసీకి.. మారుతీ సుజుకీ ఇండియాలో 56.21% వాటా ఉంది. ఆల్టోనే టాప్..: భారత్‌లో ఆల్టో కార్లను ఎక్కువగా తయారు చేశామని, 2 కోట్ల వాహనాల్లో 31.7 లక్షలు ఇవేనని కంపెనీ తెలిపింది. ఆల్టో తర్వాత ‘మారుతీ 800’ 29.1 లక్షలు, వేగనార్ 21.3 లక్షలు, ఓమ్ని 19.4 లక్షల యూనిట్లు, స్విఫ్ట్ 19.4 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. మారుతీ సుజుకీ ప్రస్తుతం 3 ప్లాంట్లలో 16 మోడళ్లను తయారు చేస్తోంది. -
14వ సారి కూడా ‘ఆల్టో’నే నంబర్ వన్
న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ మార్కెట్ లీడర్ ‘మారుతీ సుజుకీ’కి చెందిన ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కారు ‘ఆల్టో’ వరుసగా 14వ సారి కూడా దేశీ మార్కెట్లో అత్యధికంగా విక్రయమైన మోడల్‌గా అవతరించింది. ఆల్టోకి డిజైర్ గట్టిపోటినిచ్చింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో అల్టో విక్రయాలు 2,58,539 యూనిట్లుగా నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదిన 7 శాతం వృద్ధి కనిపించింది. ఇక మారుతీ డిజైర్ అమ్మకాలు 20 శాతం వృద్ధితో 2,40,133 యూనిట్లకు ఎగశాయి. దీంతో డిజైర్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మారుతీ బాలెనో మూడో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 58 శాతం వృద్ధితో 1,90,480 యూనిట్లకు చేరాయి. మారుతీ స్విఫ్ట్, మారుతీ వేగనార్ మోడళ్లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. వీటి విక్రయాలు వరుసగా 1,75,298 యూనిట్లుగా, 1,68,644 యూనిట్లుగా ఉన్నాయి. ఇక వీటి తర్వాతి స్థానాల్లో వరుసగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, విటారా బ్రెజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హ్యుందాయ్ క్రెటా, మారుతీ సెలెరియో నిలిచాయి. టాప్–5లోని మోడళ్లన్నీ మారుతీవే కావడం గమనార్హం. -
మళ్లీ ‘ఆల్టో’కే అగ్రస్థానం
న్యూఢిల్లీ: డిజైర్‌కు ఆల్టో చెక్ పెట్టింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో డిజైర్ వాహనమే టాప్–సెల్లింగ్ ప్యాసింజర్ మోడల్‌గా అవతరిస్తూ వచ్చింది. కానీ అక్టోబర్‌లో మళ్లీ ఆల్టోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన ఆల్టో వాహన విక్రయాలు 19,447 యూనిట్లుగా ఉన్నాయి. డిజైర్ వాహన అమ్మకాలు 17,447 యూనిట్లుగా నమోదయ్యాయి. డిజైర్ రెండో స్థానంలో నిలిచింది. మారుతీ బాలెనో 14,532 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నాల్గో స్థానంలో ఉంది. దీని అమ్మకాలు 14,417 యూనిటు. ఇక వేగనార్, సెలెరియో, స్విఫ్ట్ విటారా బ్రెజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, క్రెటా తర్వాత స్థానాల్లో నిలిచాయి. టాప్–10 సెల్లింగ్ ప్యాసింజర్ వాహనాల్లో మారుతీవే ఏడు మోడళ్లు ఉన్నాయి. -
'బెస్ట్ సెల్లింగ్ కారు' ట్యాగ్ దానికే!
ఆల్టో... మారుతీ సుజుకీ నుంచి వచ్చిన ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్. ఈ కారు విక్రయాలు 2017 తొలి ఐదు నెలల కాలంలోనే 1.07 లక్షల యూనిట్లకు పైగా నమోదయ్యాయి. దీంతో భారత్ లో తమ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఆల్టోనే నిలిచినట్టు మారుతీ సుజుకీ పేర్కొంది. లాంచ్ అయినప్పటి నుంచి ఆల్టోకు వినియోగదారుల నుంచి మంచి మద్దతు పొందుతూ వస్తోంది. మంచి డిజైన్ లో సరసమైన ధర, ప్రదర్శన, ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. 25 శాతం ఆల్టో కొనుగోళ్లు 30 ఏళ్ల కంటే తక్కువ వయసున యువతనే చేపడుతున్నారని కంపెనీ తెలిపింది. దీంతో గత మూడేళ్లలో విక్రయాల్లో దీని సహకారం 4 శాతం పెరిగినట్టు కూడా పేర్కొంది. తొలిసారి ఆల్టో మోడల్ ను మారుతీ సుజుకీ 2000 సెప్టెంబర్ లో భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. గత 17 ఏళ్ల అనుభవంలో కస్టమర్ల డిమాండ్ కు అనుగుణంగా ఈ కారును పలుసార్లు అప్ గ్రేడ్ చేసింది. ఆల్టో లాంచ్ అయిన తొలి మూడేళ్లలోనే లక్ష క్యుములేటివ్ విక్రయాలను నమోదుచేసింది. 2016-17లో మారుతీ సుజుకీ 21వేలకు పైగా ఆల్టో యూనిట్లను శ్రీలంక, చిల్లి, ఫిలిప్పీన్, ఉరుగ్వే వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసింది. ఎగుమతులకు తోడు దేశీయ అమ్మకాల జోరు కూడా ఈ కారుకు బాగాసహకరిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ఆల్టోలో రెండు ఇంజిన్ ఆప్షన్లున్నాయి. ఆల్టో కే10 మోడల్ క్లచ్ లెస్ ఆటో గేర్ సిఫ్ట్ ట్రాన్సమిషన్ టెక్నాలజీని కూడా ఆఫర్ చేస్తోంది. ఆల్టోను అధిగమించడానికి రెనాల్డ్ క్విడ్ దానికి గట్టి పోటీదారుగా కూడా నిలుస్తూ వస్తోంది. కానీ ఇటీవల అమ్మకాల్లో క్విడ్ మోడల్ , ఆల్టోకు అంత భారీ ఎత్తున్న పోటీ ఇవ్వలేదని తెలిసింది. -
బెస్ట్ సెల్లింగ్ మోడల్ మళ్లీ ‘ఆల్టో’నే
♦ కొనసాగుతోన్న మారుతీ ఆధిపత్యం ♦ టాప్–10లో ఏడు మోడళ్లు ఈ కంపెనీవే న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎప్పటిలాగే ఈ కంపెనీకి చెందిన ఏడు కార్లు ‘టాప్–10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్’ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. తాజాగా మే నెల వాహన విక్రయాల్లో ‘ఆల్టో’.. మళ్లీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అవతరించింది. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ♦ మారుతీ ఆల్టో విక్రయాలు ఈ మే నెలలో 23,618 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో ఇది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఇదే నెలలో ఆల్టో అమ్మకాలు 19,874 యూనిట్లుగా ఉన్నాయి. ♦ ఏప్రిల్ నెలలో టాప్‌లో నిలిచిన మారుతీ స్విఫ్ట్.. ఈసారి రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దీని విక్రయాలు 12,355 యూనిట్ల నుంచి 16,532 యూనిట్లకు పెరిగాయి. ♦ మారుతీకి చెందిన వ్యాగన్–ఆర్ 15,471 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానం దక్కించుకుంది. గతేడాది ఇదే నెలలో వ్యాగన్–ఆర్ విక్రయాలు 13,231 యూనిట్లుగా ఉన్నాయి. ♦ 14,629 యూనిట్ల విక్రయాలతో మారుతీ బాలెనో నాల్గవ స్థానంలో ఉంది. ♦ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఐదో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 12,055 యూనిట్ల నుంచి 12,984 యూనిట్లకు పెరిగాయి. ♦ మారుతీ విటారా బ్రెజా 12,375 యూనిట్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో ఈ కారు 7,193 యూనిట్లతో పదో స్థానంలో ఉంది. ♦ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏడో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 10,667 యూనిట్లుగా ఉన్నాయి. ♦ 9,073 యూనిట్ల అమ్మకాలతో మారుతీ డిజైర్ ఎనిమిదో స్థానంలో ఉంది. ♦ హ్యుందాయ్ క్రెటా 8,377 యూనిట్ల విక్రయాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ♦ మారుతీ ఎర్టిగ పదో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 7,121 యూనిట్లుగా నమోదయ్యాయి. ♦ టాప్–10లో మారుతీ, హ్యుందాయ్ మోడళ్లు తప్పు వేరే ఇతర వాహన కంపెనీల కార్లు లేకపోవడం గమనార్హం. -
ఆల్టోను బీట్ చేసిన స్విఫ్ట్
న్యూఢిల్లీ : మార్కెట్లో మారుతీ సుజుకీ కార్ల హవా అంతా ఇంతా కాదు. పోటీపడి మరీ ఆ దిగ్గజ కార్లు టాప్ ప్లేస్ లో హల్ చల్ చేస్తుంటాయి. ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉండే ఆల్టోను తన తోబుట్టువు స్విఫ్ట్ బీట్ చేసింది. ఏప్రిల్ నెలలో మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా స్విఫ్ట్ నిలిచింది. 10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో ఏడు మారుతీ సుజుకీవే చోటు దక్కించుకున్నాయి. మిగిలిన మూడు స్థానాలు మారుతీ సుజుకీ ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కార్లు ఉన్నాయి. సియామ్ తాజా డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్విఫ్ట్ కార్లు 23,802 యూనిట్లు అమ్ముడు పోయాయని తెలిసింది. ముందటేడాది ఇదే నెలలో ఇవి 15,661 యూనిట్లుగా ఉన్నాయి. అంటే గతేడాది కంటే ఈ ఏడాదికి 51.98 శాతం అమ్మకాలను పెంచుకుంది ఈ మోడల్. ఆల్టో మోడల్ 22,549 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఈ ఏడాది వృద్ధి 35.97 శాతం. 2016 ఏప్రిల్ లో ఆల్టో నెంబర్ వన్ సెల్లింగ్ మోడల్. ఆ సమయంలో స్విఫ్ట్ రెండో స్థానంలో ఉండేంది. ప్రస్తుతం ఆల్టోను స్విఫ్ట్ బీట్ చేసింది. మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బెలానో మూడో స్థానంలో 17,530 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. గతేడాది 8వ స్థానంలో ఉండగా.. ఇది ప్రస్తుతం 3వ స్థానానికి వచ్చేసింది. వాగన్ ఆర్ 4వ స్థానం, హ్యుందాయ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10లు, ఐదు ఆరు స్థానాలు, మారుతీ సుజుకీ విటారా బ్రిజా 7వ స్థానం, హ్యుందాయ్ క్రిటా 8వ స్థానం, మారుతీ సుజుకి డిజైర్ టూర్ 9వ స్థానం, సెలెరియో 10వ స్థానం దక్కించుకున్నాయి. -
టాప్‌టెన్‌లో ఆరు మారుతీ కార్లే..
న్యూఢిల్లీ: కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ హవా పెరుగుతోంది. గత నెలలో అమ్ముడైన టాప్ టెన్ కార్లలో మారుతీ కంపెనీకి చెందిన ఆరు కార్లు చోటు సాధించాయి. గత ఏడాది ఇదే నెలలో టాప్‌టెన్‌లో నాలుగు మారుతీ కార్లే స్థానం సంపాదించాయి. అక్టోబర్‌లో అధికంగా అమ్ముడైన కారుగా మారుతీ సుజుకీ ఆల్టో నిలిచిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్(సియామ్) వెల్లడించింది. టాప్‌టెన్‌లో మొదటి నాలుగు స్థానాలు మారుతీ కార్లే నిలవడం విశేషం. మారుతీ సుజుకీ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన సియాజ్, సెలెరియా కార్లు కూడా టాప్‌టెన్ జాబితాలో ఉన్నాయి.