హైదరాబాద్‌లో సైరస్ మిస్త్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ హైదరాబాద్‌లో బుధవారం అడుగుపెట్టారు. వెంకటరమణ మోటార్స్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను ప్రారంభించేందుకు ఆయన వచ్చారు. ఆయన వెంట టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మాయంక్ పరీక్ ఉన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా కంపెనీ సిబ్బందితో మాత్రమే మిస్త్రీ కొంత సేపు మాట్లాడారు. ఆయన పర్యటన అంతా గోప్యంగా జరగడం గమనార్హం.
హైదరాబాద్‌లో ఒక షోరూం ప్రారంభోత్సవానికి టాటా గ్రూప్ చైర్మన్ రావడం ఇదే తొలిసారి అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రత్యేక విమానంలో వచ్చిన సైరస్ తిరిగి సాయంత్రం వెళ్లిపోయారు. కార్యక్రమంలో వెంకటరమణ మోటార్స్ డెరైక్టర్లు వి.వి.రాజేంద్ర ప్రసాద్, వి.వికాస్ చౌదరి పాల్గొన్నారు.