స్కాట్లాండ్ ప్రభుత్వం చేతికి టాటా స్టీల్ ప్లాంట్లు | Tata Steel agrees to sell Clydebridge and Dalzell plants | Sakshi
Sakshi News home page

స్కాట్లాండ్ ప్రభుత్వం చేతికి టాటా స్టీల్ ప్లాంట్లు

Published Fri, Mar 25 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

స్కాట్లాండ్ ప్రభుత్వం చేతికి టాటా స్టీల్ ప్లాంట్లు

స్కాట్లాండ్ ప్రభుత్వం చేతికి టాటా స్టీల్ ప్లాంట్లు

లండన్: టాటా స్టీల్ కంపెనీ స్కాట్లాండ్‌లో ఉన్న రెండు ప్లాంట్‌లను ఆ దేశ ప్రభుత్వానికి విక్రయించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. క్లేడ్‌బ్రిడ్జ్రి, డాల్‌జెల్ స్టీల్ ప్లాంట్లను స్కాట్లాండ్ ప్రభుత్వానికి విక్రయించడానికి ఒప్పందం కుదిరిందని టాటా స్టీల్ తెలిపింది. డీల్ తర్వాత ఈ ప్లాంట్లను లిబర్టీ హౌస్ గ్రూప్‌ను నిర్వహిస్తున్న గుప్తా కుటుంబం కొనుగోలు చేస్తుందని సమాచారం. మళ్లీ ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించి, పెట్టుబడులు పెట్టే బాధ్యతలను లిబర్టీ గ్రూప్ తీసుకోనుంది.

Advertisement
Advertisement