
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయించిన స్టీల్ కంపెనీలకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఏపీకి వెయ్యి మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అందించిన టాటా స్టీల్ లిమిటెడ్‌కు, అలాగే జిందాల్ కంపెనీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో సీఎం జగన్ ప్రత్యేక చొరవ కారణంగా కొన్ని సంస్థలు స్వచ్చందంగా ముందుకొచ్చి రాష్ట్రానికి ప్రాణ వాయువు సరఫరా చేస్తున్నాయి.