jindhal company
-
స్టీల్ కంపెనీలకు సీఎం జగన్ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయించిన స్టీల్ కంపెనీలకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఏపీకి వెయ్యి మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అందించిన టాటా స్టీల్ లిమిటెడ్‌కు, అలాగే జిందాల్ కంపెనీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో సీఎం జగన్ ప్రత్యేక చొరవ కారణంగా కొన్ని సంస్థలు స్వచ్చందంగా ముందుకొచ్చి రాష్ట్రానికి ప్రాణ వాయువు సరఫరా చేస్తున్నాయి. -
కేసీఆర్ తో జిందాల్ కంపెనీ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో జిందాల్ కంపెనీ ప్రతినిధులు గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక విధానాలపై వారు చర్చించారు. నూతన పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉందని జిందాల్ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జిందాల్ కంపెనీ సుముఖత తెలిపింది.అదేవిధంగా వాటర్ గ్రిడ్ పథకానికి అవసరమయ్యే పైపుల సరఫరాకు జిందాల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సెయిల్ ముందుకు రాని పక్షంలో సిద్దంగా ఉండాలని జిందాల్ ప్రతినిధులకు కేసీఆర్ సూచించారు.