సాక్షి, అమరావతి: కోవిడ్–19 సంక్షోభ సమయంలో ఆక్సిజన్ సరఫరా చేయడం ద్వారా రాష్ట్రానికి అండగా నిలిచిన రిలయన్స్, టాటాస్టీల్, జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ వంటి కార్పొరేట్ సంస్థలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వేర్వేరుగా ట్వీట్ చేశారు.
కోవిడ్–19కు వ్యతిరేకంగా పోరాడుతున్న రాష్ట్రానికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలును పంపడం ద్వారా మద్దతు తెలిపిన ముఖేష్ అంబానీకి ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో కూడా ఇదే విధమైన మద్దతు కొనసాగుతుందంటూ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికైన పరిమళ్ నత్వాని ట్విటర్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్ చేశారు.
I thank Mukesh Ambani ji and @ril_foundation for extending their support by sending in Oxygen Express trains to Andhra Pradesh and helping the state in its fight against #COVID19. Looking forward to your continuous support. @mpparimal
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2021
‘ఈ కష్టసమయంలో పార్లమెంటు సభ్యుడు, జిందాల్ గ్రూపు చైర్మన్ నవీన్ జిందాల్ రాష్ట్రానికి అండగా నిలిచారని, ఈ కష్టకాలంలో జేఎస్‌పీఎల్ నుంచి రాష్ట్రానికి 500 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పంపిన నవీన్ జిందాల్‌ను అభినందిస్తున్నా’ అంటూ మరో ట్వీట్ చేశారు.
My heartfelt thanks to @TataSteelLtd for their commitment to support AP in these tough times. TATA Steel has supplied more than 1000 MT of LMO to AP, which is crucial in our fight against #COVID19.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2021
అదే విధంగా రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తూ 1,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపిన టాటాస్టీల్, రాయలసీమ ప్రాంతానికి ఆక్సిజన్ సరఫరా చేసిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు సీఎండీ సజ్జన్ జిందాల్‌లకు సీఎం కృతజ్ఞతలు తెలియచేస్తూ మరో రెండు ట్వీట్లు చేశారు.
I express my gratitude to @sajjanjindal ji for supplying LMO to the Rayalaseema region from JSW Bellary. Thank you for standing with the people of Andhra Pradesh in these tough times.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2021
Comments
Please login to add a commentAdd a comment