యమహా సెల్యూటొ కొత్త వేరియంట్ | The new version of Yamaha saluto | Sakshi
Sakshi News home page

యమహా సెల్యూటొ కొత్త వేరియంట్

Published Sat, Jul 18 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

యమహా సెల్యూటొ కొత్త వేరియంట్

యమహా సెల్యూటొ కొత్త వేరియంట్

ధర రూ. 54,500
 
 న్యూఢిల్లీ : యమహా కంపెనీ 125 సీసీ సెల్యూటొ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. డిస్క్ బ్రేక్ ఫీచర్‌తో ఉన్న ఈ కొత్త వేరి యంట్ ధర రూ.54,500 అని (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) యమహా మోటార్ ఇండియా సేల్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ చెప్పారు. సిటీ ట్రాఫిక్ పరిస్థితులను సమర్థంగా తట్టుకునేలా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించామని వివరించారు. 125 సీసీ కేటగిరీలో అమ్మకాలు పెంచుకోవడం లక్ష్యంగా ఈ బైక్‌ను తెచ్చామని పేర్కొన్నారు. ఈ బైక్ మంచి అమ్మకాలు సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా మంచి వృద్ధి సాధిస్తున్న తమ అమ్మకాలు ఈ కొత్త సెల్యూటొతో మరింతగా పుంజుకుంటాయని నమ్మకముందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement