Yamaha Motor Company
-
రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన యమహా.. రేంజ్ ఎంతో?
అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మీద చర్చ జరుగుతుంది. ప్రస్తుతం, ప్రజలకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఆసక్తి పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి స్టార్టప్ కంపెనీలతో సహ దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. తాజాగా ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ తయారీ సంస్థ యమహా ఇతర తయారీదారుల మాదిరిగా కాకుండా సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చేందుకు సిద్దం అవుతుంది. యమహా తన మొదటి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ నియోస్ యమహా మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ నియోస్. దీనిని 2019 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించిన ఈ02 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. ఈ రాబోయే ఈ-స్కూటర్ అతిపెద్ద హైలైట్ ఏమిటంటే, ఇందులో బ్యాటరీ మార్పిడి టెక్నాలజీ ఉంది. ఇది హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ చేత పనిచేస్తుంది. ఇంకా అధికారికంగా వీటి స్పెసిఫికేషన్స్ వెల్లడికాలేదు. యమహా రాబోయే ఈ-స్కూటర్లో ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సెటప్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన వాటిని అందిస్తుంది. ఇక్కడ గమనించదగ్గ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీని బ్యాటరీని రైడర్ లెగ్స్ మధ్యలో చేర్చారు. ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ01లో మాక్సీ-స్కూటర్ స్టైలింగ్, విండ్ స్క్రీన్ ఫ్రంట్ ఏప్రాన్, ఫ్లోటింగ్ రియర్ సెక్షన్, వైడ్ హ్యాండిల్ బార్లు ఉంటాయి. అయితే, ప్రొడక్షన్ రెడీ మోడల్'లో రీడిజైన్ చేసిన స్టెప్ అప్ సీటు ఉంది. జపనీస్ బ్రాండ్ ఈ01కి చెందిన ఫుల్ స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే దీనిని సింగిల్ ఛార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్ల రేంజ్ అందించే 4 కెడబ్ల్యుహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ 125సీసీ స్కూటర్ కి సమానంగా దూసుకెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ గల ఎల్సిడి డిస్ప్లే కలిగి ఉంటుంది. (చదవండి: టాటా ప్లే(స్కై) కస్టమర్లకు శుభవార్త..!) -
ఎలక్ట్రిక్ వాహనల కోసం ప్రణాళికలు రచిస్తున్న యమహా!
జపాన్ ద్విచక్ర వాహన సంస్థ యమహా భారతదేశం, ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొనిరావడానికి ప్రణాళికలను రచిస్తుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీలో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్దం అవుతున్నట్లు తెలిపింది. ఈ-మొబిలిటీలో పెట్టుబడులు భారత ప్రభుత్వ విధానంపై, స్పష్టమైన రోడ్ మ్యాప్ పై ఆధారపడి ఉంటుందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఫేమ్ 2 పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని భారీగా పెంచింది. కానీ, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలను ఇంకా పరిష్కరించాల్సిన అవసరం ఉందని యమహా అభిప్రాయపడింది. జపాన్ లోని నిపుణుల బృందం భారతదేశం, ప్రపంచంలోని ఇతర మార్కెట్ల కోసం ఈవి వేదికను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్లు యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ మోటోఫుమి షితారా తెలిపారు. "ఇప్పటికే మా జపాన్ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేక బృందం భారతదేశం, ఇతర ప్రపంచ మార్కెట్ల అవసరాల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొని రావడానికి పనిచేస్తుంది" అని పేర్కొన్నారు. ఈవీ బ్రాండ్ గోగోరోతో కలిసి పనిచేస్తోందని, గత రెండు సంవత్సరాలుగా తైవాన్ కర్మగరంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోందని కూడా ఆయన తెలియజేశారు. ఇండియాకి విషయానికి వస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి గణనీయమైన సవాళ్లు ఎదుర్కొంటున్నామని షితారా తెలియజేశారు. "ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించిన పెద్ద సవాళ్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్, స్థిరమైన విధానాన్ని రూపొందించకపోతే దీనిని పరిష్కరించలేము" అని ఆయన అన్నారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల సంబందించిన సమస్యలను పరిష్కరించగలిగితే సామాన్య ప్రజలు ఈవిలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని ఆయన నొక్కి చెప్పారు. "కాబట్టి పైన పేర్కొన్న అన్నీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిన తర్వాత, మేము భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడమే కాకుండా తయారు చేస్తాము" అని షితారా పేర్కొన్నారు. యమహా ఇటీవల ఫాసినో 125 ఫై హైబ్రిడ్ స్కూటర్ లాంఛ్ చేసింది. -
యమహా సెల్యూటొ కొత్త వేరియంట్
ధర రూ. 54,500 న్యూఢిల్లీ : యమహా కంపెనీ 125 సీసీ సెల్యూటొ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. డిస్క్ బ్రేక్ ఫీచర్‌తో ఉన్న ఈ కొత్త వేరి యంట్ ధర రూ.54,500 అని (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) యమహా మోటార్ ఇండియా సేల్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ చెప్పారు. సిటీ ట్రాఫిక్ పరిస్థితులను సమర్థంగా తట్టుకునేలా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించామని వివరించారు. 125 సీసీ కేటగిరీలో అమ్మకాలు పెంచుకోవడం లక్ష్యంగా ఈ బైక్‌ను తెచ్చామని పేర్కొన్నారు. ఈ బైక్ మంచి అమ్మకాలు సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా మంచి వృద్ధి సాధిస్తున్న తమ అమ్మకాలు ఈ కొత్త సెల్యూటొతో మరింతగా పుంజుకుంటాయని నమ్మకముందని పేర్కొన్నారు. -
యమహా స్కూటర్స్‌లో కొత్త వేరియంట్లు
బ్లూ కోర్ ఇంజిన్ కాన్సెప్ట్‌తో రూపకల్పన న్యూఢిల్లీ: యమహా కంపెనీ తన మూడు స్కూటర్ మోడళ్లు-ఆల్ఫా, రే, రే జెడ్లలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు కొత్త వేరియంట్లను బ్లూ కోర్ ఇంజిన్ కాన్సెప్ట్‌తో రూపొందించామని యమహా మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ పేర్కొన్నారు. ఈ బ్లూ కోర్ ఇంజిన్ కాన్సెప్ట్ పర్యావరణానికి అనుకూలమైనదని, అంతేకాకుండా ఎక్కువ మైలేజీ కూడా వస్తుందని వివరించారు. గతంలో 62 కి.మీ.గా ఉన్న మైలేజీ ఈ కొత్త బ్లూ కోర్ ఇంజిన్ కారణంగా 66 కి.మీ.కు పెరుగుతుందని వివరించారు. ఆల్ఫా ధర రూ.49,939, రే జెడ్ ధర రూ.48,936, రే ధర రూ.47,805గా నిర్ణయించామని(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) తెలిపారు. కొత్త ఫీచర్లు, గ్రాఫిక్స్‌తో ఈ కొత్త వేరియంట్లను రూపొందించామని తెలిపారు. భారత టూవీలర్ల మాస్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలవాలనుకుంటున్నామని, దీనిని సాధించడానికి స్కూటర్లపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో తమ మొత్తం అమ్మకాల్లో సగం స్కూటర్ల అమ్మకాలు ఉండగలవని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 5 శాతంగా(నెలకు 5 లక్షల స్కూటర్ల విక్రయాలు) ఉన్న తమ మార్కెట్ వాటాను ఈ కొత్త స్కూటర్ల వేరియంట్లతో ఈ ఏడాది చివరికల్లా 10 శాతానికి పెంచుకోవడం లక్ష్యమని వివరించారు.