టయోటా ఫార్చునర్‌.. ‘స్పోర్టియర్‌’ | Toyota Kirloskar Motor rollouts Fortuner TRD Sportivo | Sakshi
Sakshi News home page

టయోటా ఫార్చునర్‌.. ‘స్పోర్టియర్‌’

Published Fri, Sep 22 2017 12:35 AM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

టయోటా ఫార్చునర్‌.. ‘స్పోర్టియర్‌’

టయోటా ఫార్చునర్‌.. ‘స్పోర్టియర్‌’

ధర రూ. 31లక్షలు
న్యూఢిల్లీ
: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) తాజాగా తన ప్రీమియం ఎస్‌యూవీ ‘ఫార్చునర్‌’లో స్పోర్టియర్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ‘ఫార్చునర్‌ టీఆర్‌డీ స్పోర్టివో’ పేరిట తెచ్చిన ఈ కొత్త వేరియంట్‌ ధర రూ.31.01 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. టయోటా రేసింగ్‌ డెవలప్‌మెంట్‌ (టీఆర్‌డీ) విభాగం ఈ కొత్త ఎడిషన్‌ను అభివృద్ధి చేసింది. ఫార్చునర్‌ టీఆర్‌డీ స్పోర్టివోలో పలు మార్పులు చేశామని, ఇది అన్ని వర్గాల కస్టమర్లను ఆకర్షిస్తుందని సంస్థ  ధీమా వ్యక్తంచేసింది. ఫార్చునర్‌ ఇప్పటికే అసలైన ఎస్‌యూవీగా గుర్తింపు పొందిందని.. నమ్మకం, దృఢత్వం, నాణ్యత, పనితీరు, స్టైల్‌ వంటి పలు అంశాల్లో వినియోగదారులను ఆకట్టుకుంటోందని పేర్కొంది.  

మార్కెట్‌లోకి టాటా ‘నెక్సాన్‌’
ప్రారంభ ధర రూ. 5.85 లక్షలు
ముంబై: దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్‌’ తాజాగా తన తొలి సబ్‌–కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘నెక్సాన్‌’ను గురువారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇది 1.2 లీటర్‌ పెట్రోల్, 1.5 లీటర్‌ డీజిల్‌ అనే రెండు ఇంజిన్‌ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.5.85 లక్షలు కాగా, డీజిల్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.6.85 లక్షలుగా ఉంది.

ఈ ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి. నెక్సాన్‌ మోడల్‌తో యుటిలిటీ వాహన విభాగంలో 3 లేదా 4వ స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని టాటా మోటార్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గుంటర్‌ బషెక్‌ ఈ సందర్భంగా తెలిపారు. నెక్సాన్‌ అనేది టాటా మోటార్స్‌ నుంచి వస్తోన్న తొలి సబ్‌–4 మీటర్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌.   ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతీ సుజుకీ విటారా బ్రెజా, ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్, హ్యుందాయ్‌ క్రెటా వంటి మోడళ్లకు టాటా నెక్సాన్‌ గట్టిపోటీనిస్తుందని వాహన రంగానికి చెందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Advertisement