జలగం సుధీర్‌కు టీచర్ వారియర్ అవార్డు
జలగం సుధీర్‌కు టీచర్ వారియర్ అవార్డు
Published Sat, Aug 19 2017 4:41 PM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM
న్యూడిల్లీలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో చేసిన సేవలకు గాను దేశ వ్యాప్తంగా 16 మందికి టీచర్ వారియర్ 2017 పేరిట అవార్డులు ప్రధానం చేశారు. ఇందులో భాగంగా ప్రవాస తెలంగాణ వాసి జలగం సుధీర్ టీచర్ వారియర్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమై రెండు రోజులపాటు జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన సుధీర్.. అమెరికాలో బాగా పాపులర్ అయిన కాఫీ విత్ ప్రిన్సిపాల్ అనే కార్యక్రమం స్పూర్తితో టీ విత్ హెడ్మాస్టర్ పేరుతో పాఠశాలల అభివృద్ధికి కృషి చేసినందుకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ సందర్బంగా జలగం సుధీర్ మాట్లాడుతూ ' పేద, మధ్య తరగతి కుబుంబాలు విద్య, వైద్యం మీద పెట్టే ఖర్చులు, తద్వారా ఆత్మహత్యలకు.. అప్పులకు కారణం అవుతున్నాయని తెలుసుకున్నాను. పాఠశాలల అభివృద్ధి వల్లే వారి సమస్యలు తగ్గించవచ్చని టీ విత్ హెడ్మాస్టర్ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ స్కూళ్లలో సమస్యలు తీర్చడం, అభివృద్దిలో భాగస్వామ్యం చేశాను. 2001 సంవత్సరం నుంచి అనేక మంది అనేక గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశాను. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, విద్యా శాఖమంత్రి కడియం శ్రీహరి , సుర్యాపేట కలెక్టర్ సురేంద్ర మోహన్, ప్రభుత్వ ఉపాద్యాయులు, పేరెంట్స్, దాతలు, విద్యార్దులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవార్డు వారందరికి అంకితం చేస్తున్నాను' అని ఆయన తెలిపారు.
ఈ ఫెస్ట్ లో చిన్న పిల్లల ఆరోగ్యం నుంచి ప్రాథమిక, ఉన్నత విద్యపై అనేకమంది మేధావులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత విద్యావిధానం, ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ల అభివృద్ధి, విదేశీ, స్వదేశీ పరిజ్ఞానం, మురిగివాడల్లో విద్య, బోధనా రంగంలో సవాళ్లు వంటి అనేక అంశాలపై చర్చించారు. సుమారు 20 దేశాల నుంచి 800 మందికి పైగా ప్రతినిదులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫెస్ట్ నిర్వహించిన నిర్వాహకులను వారు అభినందించారు.
సుధీర్ తో పాటు (సౌగాత మిత్ర) లడక్, (సుజాత సాహు) హిమాచల్ ప్రదేశ్, కోల్‌కతా (జలాలుద్దిన్), లక్నో (డాక్టర్ అమితాబ్ మెహొత్ర, ఆకాషి అబ్రహం), ముంబై (సందీప్ దేశాయి), గౌహతి (ఉత్తం టెరాన్), చిత్రదుర్గ (మారియ జులియన్), ముర్షిదాబాద్ (బాబర్ ఆలి), గుర్గావ్ (నవిన్ గులియా), అహ్మదాబాద్ (మిట్టల్ పటేల్) వంటి ప్రవాస భారతీయులకు.. మారు మూల ప్రాంతాల్లో, మురికి వాడల్లో, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది తదితర అంశాలకు చేసిన కృషిగాను ఈ అవార్డ్స్ ప్రధానం చేశారు.
Advertisement
Advertisement