అనంతపురం సెంట్రల్ : పోలీస్ శాఖలో 10 మంది ఎస్‌ఐలకు స్థానం చలనం కల్పిస్తూ మరో 12 మంది పీఎస్‌ఐలకు పోస్టింగ్‌లు ఇస్తూ ఎస్పీ రాజశేఖరబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన ఎస్‌ఐలు..
ఓడీ చెరువు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి కదిరి టౌన్‌కు, సతీష్‌కుమార్(పట్నం) అనంతపురం ట్రాఫిక్‌కు, శివగంగాధర్‌రెడ్డి( నల్లమాడ ) అనంతపురం టూటౌన్‌కు, ప్రదీప్‌కుమార్( పుట్లూరు ) తాడిపత్రి అర్బన్‌కు, తమీమ్ అహ్మద్(యల్లనూరు ) స్పెషల్‌బ్రాంచ్‌కు , నగేష్‌బాబు( కంబందూరు ) వీఆర్‌కు, షేక్ మహ్మద్ బాషా(సోమందేపల్లి) హిందూపురం టూ టౌన్‌కు, అంజనయ్య(అగళి ) హిందూపురం టూటౌన్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
12 మంది పీఎస్‌ఐలకు పోస్టింగ్‌లు
12 మంది ప్రొహిబిషనరీ ఎస్‌ఐ(పీఎస్‌ఐ)లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కొమ్మినేని రామ్‌బాబుకు అగళి ఎస్‌ఐగా పోస్టింగ్ ఇచ్చారు. , ఖాజా హుస్సేన్– గుడిబండకు, గోపీ– నల్లమాడకు, హరినా«థ్‌రెడ్డి–యల్లనూరుకు, మునీర్ అహ్మద్– రొద్దానికి, సురేష్‌బాబు– పుట్లూరకు, రమేష్‌బాబు–ఎన్‌పీకుంటకు, నరసింహుడు–కంబదూరుకు, ప్రసాద్–సోమందేపల్లికి, చంద్రశేఖర్– తలపులకు, రాఘవయ్య–పట్నానికి, సత్యనారాయణను ఓడీచెరువు ఎస్‌ఐగా నియమించారు.
12 మంది పీఎస్‌ఐలకు పోస్టింగ్
Published Wed, Aug 31 2016 10:02 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
Advertisement
Advertisement