అనంతపురం టౌన్ : ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లాకు 19,700 కొత్త పింఛన్లు విడుదలయ్యాయి. నియోజకవర్గానికి 2వేల చొప్పున కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 28వేల పింఛన్లు విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే జన్మభూమి కమిటీల ద్వారా అర్హులైన వారి జాబితాలను సెర్ఫ్‌కు పంపించారు.
అయితే, ప్రస్తుతానికి 19,700 మాత్రమే విడుదలయ్యాయి. కాగా కొత్త పింఛన్లకు సంబంధించి 8,300 ఇంకా విడుదల కావాల్సి ఉంది. వీటిని విడుదల చేస్తుందా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ విషయమై డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లుకు ‘సాక్షి’ ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఫిబ్రవరి నెలకు సంబంధించి వితంతు, వికలాంగ, వృద్ధాప్య, చేనేత, కల్లు గీత కింద మొత్తం 4లక్షలా 4వేలా 443 పింఛన్లు విడుదలయ్యాయి. ఇందు కోసం రూ.43కోట్లా 43లక్షలను ప్రభుత్వం కేటాయించింది.
19,700 కొత్త పింఛన్లు విడుదల
Published Sat, Jan 28 2017 11:07 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
Advertisement
Advertisement