కన్యకా పరమేశ్వరికి రూ.20 లక్షల బంగారు చీర
కన్యకా పరమేశ్వరికి రూ.20 లక్షల బంగారు చీర
Published Thu, Oct 6 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
నాయుడుపేటటౌన్:పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవికి రూ.20 లక్షలకు పైగా వ్యయంతో తయారు చేసిన బంగారు చీర, రవిక, పాదాలు, హస్తాలను బుధవారం దాతలు బహూకరించారు. పట్టణానికి చెందిన కనమర్లపూడి సుబ్రమణి (సురేష్), అతని సోదరులు రమేష్, వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు బంగారు వస్తువులను ప్రత్యేక పూజల నడుమ అలంకరింప చేశారు. దాతలను ఆర్యవైశ్య సంఘ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త పెసల కిషోర్, రాజాబాబు, సంఘ గౌరవాధ్యక్షుడు దేవతా చెంచు వెంకటకృష్ణమూర్తి, ఆర్యవైశ్య సంఘ నాయకులు కోట వెంకటేశ్వర్లు, మెంటా కృష్ణరావు, గాధంశెట్టి భాస్కర్, పలు ఆలయాలకు చెందిన కమిటీల పెద్దలు ఉన్నారు.
Advertisement
Advertisement