సంప్రదాయ సేద్యానికి బాటలు వేయూలి
కల్వకుర్తి :
సంప్రదాయ వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై రైతులు ఆసక్తి చూపినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని జారుుంట్ కలెక్టర్ శర్మన్ అన్నారు. లోక్ నాయక్ జయప్రకాశ్‌నారాయణ రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరీ ఆలయఆవరణంలో బుధవారం మాజీ సర్పంచ్ అల్వాల్‌రెడ్డి అధ్యక్షతన రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తానూ రైతు బిడ్డనేనని, రైతు సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. శాస్త్రవేత్తలు నూతన వంగడాలను సృష్టిస్తున్నా, అవి రైతులకు చేరడం లేదన్నారు. రైతు కన్నీరు పెట్టడం దేశానికి మ ంచిది కాదని, రైతుల అభ్యున్నతికి ప్రతి ఒక్క రూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను కొంతకాలం పాటు వ్యవసాయ ప్రతికను నిర్వహించానని, ప్రతి అం శంపై రైతులు దీర్ఘ దృష్టితో ముందుకు సాగుతూ వ్యవసాయంలో లాభాలు ఆర్జించాలన్నారు. రసాయనిక ఎరువుల వాడకంతోనే అధిక దిగుబడులు వస్తాయనే భ్రమనుంచి రైతులు బయట పడాల్సిన అవసరం ఉందన్నారు.
స్వామినాథన్ సిఫారసులు
అమలు చేయాలి...
ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. లోక్ నాయక్ జయప్రకాశ్నారాయణ్నుఆదర్శంగా తీసుకుని రైతులకు అండగా ఉండేందుకు వ్యవసాయంపై వారికి పూర్తి అవగాహన కల్పించేందుకు రైతు సదస్సు నిర్వహించనట్లు తెలిపారు. తరతరాలుగా భూమని నమ్ముకొని జీవిస్తున్న రైతులకు మేలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభ్యున్నతి కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆయన కోరారు. విత్తనాలు, ఎరువుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యూయని, పడించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత యూపీఏ పాలనలో 2, 16, 800 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 47 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలిపారు.
నూతన వంగడాలను
సాగు చేయాలి...
అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. వరి సాగులో డ్రమ్ సీడర్‌ను వినియోగించాలని, ఉద్యాన వన, పండ్ల తోటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పాడి, కోళ్ల పరిశ్రమలతో ప్రత్యామ్నాయ ఆదాయూన్ని పొందవచ్చునన్నారు. పండ్లతోటల సాగుకు ప్రభుత్వం ఇస్తున్న రారుుతీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలన్నారు.