39 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | 39 Red Sandle logs Seized | Sakshi
Sakshi News home page

39 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Sat, Oct 15 2016 10:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

39 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

39 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

– వాటి విలువ సుమారు రూ.4లక్షలు
– నలుగురు అరెస్టు

రామాపురం: మండలంలోని సరస్వతిపల్లె బీట్‌ పరిధిలో వంగిమళ్ల పాలకొండల అటవీ ప్రాంతంలోని రేనిమాకుల కుంట సమీపంలో శనివారం తెల్లవారుజామున 1005 కేజీల బరువు గల 39 ఎర్రచందనం దుంగలను రాయచోటి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. రాయచోటి రేంజర్‌ జి.జె ప్రసాద్‌రావు తన కార్యాలయంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం బేస్‌క్యాంపు స్రై్టక్‌ ఫోర్స్‌ సిబ్బంది అటవీశాఖ సిబ్బందితో  కలిసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిరుణామలై జిల్లా గుందలత్తూర్‌ గ్రామానికి చెందిన చిన్నప్పయన్‌ శశికుమార్, అతీమూర్‌ గ్రామానికి చెందిన గోపాల్‌ రాజమూర్తి, అమర్తి గ్రామానికి చెందిన పాపన్నమణి, అనంతపురం జిల్లా నంబులపూలుకుంట గ్రామానికి చెందిన పప్పూరి సాంబశివయ్యలు అడవిలో దుంగలతో ఉన్నారని తెలిసి మెరుపుదాడి నిర్వహించామన్నారు. మొత్తం 7 మంది స్మగ్లర్లు ఉండగా వారిలో నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్దగ ల 38 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. అవి సుమారు 1005 కేజిల బరువు ఉన్నట్లు తెలిపారు. పరారైన వారిలో అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంటకు చెందిన హరి ప్రధాన నిందితుడన్నారు. తమిళనాడు నుంచి బెంగళూరు మీదుగా కదిరికి వచ్చి ఇక్కడ అటవీ ప్రాంతంలో ఎర్రచందన ం స్మగ్లింగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నాడన్నారు.  ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ కే శ్రీనివాసులు, ఎఫ్‌బీఓలు శ్రీనాథరెడ్డి, బి. కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement