యువకుడిపై కత్తులతో దాడి
♦ సారా అమ్మవద్దని చెప్పినందుకు
♦ దాడిచేసిన అమ్మకందారులు
భామిని: సారా అమ్మకాలు చేపట్టవద్దని చెప్పినందుకు ఓ యువకుడిపై విక్రయదారులు కత్తులతో దాడి చేశారు. భామిని మండలం బత్తిలిలోని రెల్లివీధిలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలావున్నాయి. బత్తిలిలోని రెల్లివీధికి చెందిన బాదాపు సుధాకర్ ఆ వీధిలో సారా విక్రయాలు చేపట్టవద్దని అమ్మకందారులకు పలుమార్లు చెప్పాడు. విక్రయిస్తే ఆందోళనలు చేపడతామని హెచ్చరించాడు. దీనిని జీర్ణించుకోలేని సారా విక్రయదారులు సుధాకర్‌పై కత్తులతో దాడి చేశారు.
తీవ్ర గాయాలపాలైన సుధాకర్‌ను వెంటనే స్థానికులు భామిని పీహెచ్‌సీకి తరలించారు. స్టాప్‌నర్స్ దివ్యభారతి వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి రిపర్ చేశారు. ఈ మేరకు బాధితుడు బత్తిలి పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
బత్తిలిలోని రెల్లివీధిలో సారా అమ్మకాలపై బత్తిలి పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బంగారి శేఖర్ ఆరోపించారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకుంటే ఈ దాడి జరిగేది కాదని వాపోయారు.