సాగరం ఒడితో స్వామి చక్రస్నానం
-
కల్యాణోత్సవాల్లో 8వ రోజు కమనీయ ఘట్టం
-
దేవదేవుని జలకం వేళే వేలాదిమంది పుణ్యస్నానాలు
-
గరుడ పుష్పకవాహనంపై స్వామి గ్రామోత్సవం
అంతర్వేది(సఖినేటిపల్లి) :
మాఘ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం అంతర్వేది వద్ద సముద్రతీరంలో భక్తిభావం ఉప్పొంగింది. శ్రీలక్షీ్మనృసింహస్వామి జలకమాడిన కడలిలోనే వేలాదిమంది భక్తులు తలమునకలై పులకించిపోయారు. వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు స్వామివారి చక్రస్నానం అత్యంత వైభవంగా జరిగింది. సుదర్శన చక్రం ధరించిన నృసింహస్వామి(శ్రీసుదర్శన పెరుమాళ్ స్వామి) తో వేలాదిమంది భక్తులు ఉదయం 10.30 గం టల సమయంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, మాజీ ప్రధాన అర్చకుడు వాడపల్లి బుచ్చిబాబు, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్రి్తల ఆధ్వర్యంలో పేరూరు ఉద్దండ పండితులు స్వామిని శిరస్సుపై ఉంచుకుని సముద్రస్నానం చేయించారు. ఉదయం 8.30గంటలకు ఆలయంలోని అలంకార మండపం నుంచి ఉత్సవమూర్తులను గరుడపుష్పక వాహనంలో, సుదర్శన చక్రధారుడైన నృసింహస్వామి(చక్రపెరుమాళ్ స్వామి)ని పల్లకీలో ఊరేగిస్తూ తీరానికి తోడ్కొని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షామియానాలో స్వామి, అమ్మవార్లను ఆసీనులను చేశారు. సుదర్శన చక్రధారుడైన నృసింహస్వామిని పంచామృతాలతో, కొబ్బరినీళ్లతో అభిషేకించా రు. పేరూరు పండితులు స్వామిని శిరస్సుపై ధరించి సముద్రస్నానం చేయిం చారు. అనంతరం స్వామిని వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు, ఆర్డీఓ గణేష్‌కుమార్, పారిశ్రామికవేత్త జంపన సత్యనారాయణరాజు, సీఐ క్రిష్టాఫర్, సర్పంచ్ భాస్కర్ల గణపతి, మాజీ సర్పంచ్‌లు వనమాలి మూలాస్వామి, కొల్లాటి నరసింహస్వామి, ఎంపీటీసీ సభ్యుడు వాసు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు బళ్ల వెంకట నాగభాస్కరరావు, ఆరుమిల్లి నాగలక్ష్మి, ఉత్సవ సేవా కమిటీ చైర్మ¯ŒS జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.