chakrasnanam
-
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమల : ఘనంగా చక్రస్నాన మహోత్సవం
-
శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని ‘అయినా మహల్’ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ‘అయినా మహల్’ ముఖ మండపం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో ఉదయం 8.15 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో ముంచి స్నానం చేయించారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభ ధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశ శాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. చక్రస్నానం - లోకం క్షేమం.. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ - చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం' చేస్తారు. యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంత స్నానం అవభృథం. చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాప విముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విష మృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటల నుంచి నుండి తొమ్మిది గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్ రెడ్డి, డా.నిశ్చిత, శివకుమార్, డీపీ అనంత, అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, సిఇ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. వైభవంగా బ్రహ్మోత్సవాలు: వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఏకాంతంగా నిర్వహించామని తెలిపారు. కోవిడ్ కారణంగా ఈసారి ఏకాంతంగా నిర్వహించినా, ఎక్కడ లోపం లేకుండా వైభవంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. చక్రస్నానం ఏకాంతంగానే నిర్వహించామని చెప్పారు. సాయంత్రం ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. -
శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్ర స్నానం
-
వైభవంగా చక్రస్నాన మహోత్సవం
-
సాగరం ఒడితో స్వామి చక్రస్నానం
కల్యాణోత్సవాల్లో 8వ రోజు కమనీయ ఘట్టం దేవదేవుని జలకం వేళే వేలాదిమంది పుణ్యస్నానాలు గరుడ పుష్పకవాహనంపై స్వామి గ్రామోత్సవం అంతర్వేది(సఖినేటిపల్లి) : మాఘ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం అంతర్వేది వద్ద సముద్రతీరంలో భక్తిభావం ఉప్పొంగింది. శ్రీలక్షీ్మనృసింహస్వామి జలకమాడిన కడలిలోనే వేలాదిమంది భక్తులు తలమునకలై పులకించిపోయారు. వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు స్వామివారి చక్రస్నానం అత్యంత వైభవంగా జరిగింది. సుదర్శన చక్రం ధరించిన నృసింహస్వామి(శ్రీసుదర్శన పెరుమాళ్ స్వామి) తో వేలాదిమంది భక్తులు ఉదయం 10.30 గం టల సమయంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, మాజీ ప్రధాన అర్చకుడు వాడపల్లి బుచ్చిబాబు, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్రి్తల ఆధ్వర్యంలో పేరూరు ఉద్దండ పండితులు స్వామిని శిరస్సుపై ఉంచుకుని సముద్రస్నానం చేయించారు. ఉదయం 8.30గంటలకు ఆలయంలోని అలంకార మండపం నుంచి ఉత్సవమూర్తులను గరుడపుష్పక వాహనంలో, సుదర్శన చక్రధారుడైన నృసింహస్వామి(చక్రపెరుమాళ్ స్వామి)ని పల్లకీలో ఊరేగిస్తూ తీరానికి తోడ్కొని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షామియానాలో స్వామి, అమ్మవార్లను ఆసీనులను చేశారు. సుదర్శన చక్రధారుడైన నృసింహస్వామిని పంచామృతాలతో, కొబ్బరినీళ్లతో అభిషేకించా రు. పేరూరు పండితులు స్వామిని శిరస్సుపై ధరించి సముద్రస్నానం చేయిం చారు. అనంతరం స్వామిని వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు, ఆర్డీఓ గణేష్‌కుమార్, పారిశ్రామికవేత్త జంపన సత్యనారాయణరాజు, సీఐ క్రిష్టాఫర్, సర్పంచ్ భాస్కర్ల గణపతి, మాజీ సర్పంచ్‌లు వనమాలి మూలాస్వామి, కొల్లాటి నరసింహస్వామి, ఎంపీటీసీ సభ్యుడు వాసు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు బళ్ల వెంకట నాగభాస్కరరావు, ఆరుమిల్లి నాగలక్ష్మి, ఉత్సవ సేవా కమిటీ చైర్మ¯ŒS జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం
-
పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం
తిరుమల : తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన కార్యక్రమం మంగళవారం ఉదయం ముగిసింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో నేటి రాత్రి ధ్వజావరోహణం జరగనుంది. దీంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
వైభవంగా రథోత్సవం.. రేపు శ్రీవారికి చక్రస్నానం
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో 8వ రోజు సోమవారం ఉదయం 7 గంటలకు రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం శ్రీవారు మల్లయప్పస్వామిగా అలంకృతుడై బ్రహ్మారధం పై మాడ వీధుల్లో ఊరేగారు. స్వామిని కనులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో అందరినీ అలరింపజేశారు. రథాన్ని లాగే క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. రథం తిరుగుతున్న సమయంలో ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించారు. రేపు (మంగళవారం) ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు సంయమనం పాటించి సహకరించాలని టీటీడీ ఈవో సాంబశివరావు కోరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పుష్కరిణి వద్ద ఈతగాళ్లను, బోటను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. -
పద్మావతి ఘాట్‌లో చక్రస్నానం
విజయవాడ: కృష్ణ పుష్కరాల ముగింపు సందర్భంగా విజయవాడ పద్మావతి ఘాట్‌లో టీటీడీ ఆధ్వర్యంలో చక్రస్నానం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు తదితరులు హాజరయ్యారు.