Published
Tue, Aug 2 2016 12:06 AM
| Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
అప్పన్న హుండీ ఆదాయం రూ. 85.21 లక్షలు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం గడిచిన 21 రోజులకు 85లక్షల 21వేల 643 రూపాయలు వచ్చినట్టు సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. సింహగిరిపై ఆలయ బేడా మండపంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 115 గ్రాముల బంగారం, 6కిలోల 040 గ్రాముల వెండి లభించినట్టు ఈవో తెలిపారు. అలాగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి సోదరి, అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం 96వేల 695 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈలెక్కింపులో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శ్రీహరి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.