appanna
-
అచ్చెన్న ‘రాజ్యం’లో అరాచకం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నియంత వైఖరి మరోసారి బట్టబయలవుతోందని నిమ్మాడ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు, సర్పంచ్ అభ్యర్థి కింజరాపు అప్పన్న అన్నారు. సర్పంచ్ పదవికి పోటీ చేశాననే కారణంతో తనను గ్రామ బహిష్కరణ చేశారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్, సురేష్ వారి అనుచరులు ప్రతి రోజూ తనను భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులతో గ్రామస్తులను మాట్లాడనివ్వడం లేదన్నారు. పొలానికి కూలీలు కూడా రాకపోవడంతో మినప చేను వదిలేయాల్సి వచ్చిందని వాపోయారు. దుస్తులు ఉతికేందుకు రజకులు, క్షవరం చేయడానికి నాయీబ్రాహ్మణులను రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. తమతో ఎవరైనా మాట్లాడితే వారిని బెదిరిస్తున్నారని అన్నారు. అచ్చెన్నకు ఎదురు తిరిగి మరణించిన వారిలో ఆరో వ్యక్తిగా శవమైపోతావ్ అని బెదిరిస్తున్నారని వాపోయారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని, గ్రామ బహిష్కరణ నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లే కాపాడాలని కోరారు. చిన్నబమ్మిడికి చెందిన వాన ఆదినారాయణ పాల్గొన్నారు. -
అప్పన్న సన్నిధిలో విదేశీ బృందం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం విదేశీ అధికార బృందం దర్శించుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామీణావృద్ధిని పరిశీలించేందుకు పలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు రాష్రీ్టయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో తరలివచ్చారు. కప్పసం్తభాన్ని ఆలింగనం చేసుకుని బేడాచుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో అషో్టత్తరంపూజ, గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చనలు నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. హుండీఆదాయం రూ.99.52 లక్షలు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం గడిచిన 29 రోజులకు రూ. 99 ,52, 490 వచ్చినట్టు సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. నగదుతోపాటు 125 గ్రాముల బంగారం, 8 కిలోల 750 గ్రాముల వెండి వచ్చినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన లెక్కింపులో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శ్రీహరి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
అప్పన్న సన్నిధిలో వైవీఎస్ చౌదరి
సింహాచలం :సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి మంగళవా రం సింహాచలం శ్రీవరాహలక్ష్మీనసింహస్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాల యం లో అషో్టత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశా రు. స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు. . -
అప్పన్న హుండీ ఆదాయం రూ. 85.21 లక్షలు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం గడిచిన 21 రోజులకు 85లక్షల 21వేల 643 రూపాయలు వచ్చినట్టు సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. సింహగిరిపై ఆలయ బేడా మండపంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 115 గ్రాముల బంగారం, 6కిలోల 040 గ్రాముల వెండి లభించినట్టు ఈవో తెలిపారు. అలాగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి సోదరి, అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం 96వేల 695 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈలెక్కింపులో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శ్రీహరి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
అప్పన్నకు ‘ఐటీ’ నామం!
- మధురవాడలోని దేవస్థానం భూములు మాయం.. - రూ. 250 కోట్ల విలువైన భూమి నామమాత్రపు లీజుకు - ఈ-సెంట్రిక్ సొల్యూషన్కు ధారాదత్తం - ఆగమేఘాలపై ప్రతిపాదనలు - పాలకమండలి తీర్మానం లేకుండానే... - నేడు కేబినెట్ భేటీలో ఆమోదముద్ర సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దేవుడి భూములనూ వదలకుండా ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధమైంది. సింహాద్రి అప్పన్న భూములపైన కన్నేసింది. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో కోల్పోయిన భూమికి ప్రత్యామ్నాయంగా సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న వంద ఎకరాల సింహాద్రి అప్పన్న భూములపై మళ్లీ ఆయన హయాంలోనే సర్కారు పెద్దల కన్నుపడింది. మధురవాడలోని సింహాచలం దేవస్థానానికి చెందిన వంద ఎకరాల విలువైన భూముల్లో 50 ఎకరాలను ఐటీ కంపెనీకి నామమాత్రపు లీజుపై అప్పనంగా ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధమైంది. మధురవాడలోని సింహాద్రి అప్పన్నకు చెందిన రూ.250 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ‘ఈ-సెంట్రిక్ సొల్యూషన్’ అనే ఐటీ కంపెనీకి నామమాత్రపు లీజుకు అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేశారు. బుధవారం రాజమండ్రిలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 50 ఎకరాల భూమిని ఈ-సెంట్రిక్ సొల్యూషన్ కంపెనీకి ఎకరానికి కేవలం రూ.లక్ష చొప్పున లీజుకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. అది కూడా 50 ఎకరాలకు రూ.లక్ష చొప్పున లీజుపై అనుకుంటే పొరపాటే. తొలి ఏడాది కేవలం మూడు ఎకరాలకు, ఆ మరుసటి ఏడాది ఆరు ఎకరాలకు... ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.6 లక్షలకు లీజుకు ఇస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మిగతా భూమి కూడా ఐటీ కంపెనీ ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఆ భూమికి ఇప్పుడు లీజు ఇవ్వరు. ఇంత అడ్డగోలు వ్యవహారం కోసం రాజమండ్రిలో మకాం వేసి ఉన్న ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద ఈ-సెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్‌కు 50 ఎకరాలు ఉదారంగా ధారాదత్తం చేసే ప్రతిపాదనలను తెప్పించుకున్నారు. భూ కేటాయింపు విధానానికి విరుద్ధంగా దేవుడి భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలంటే ఆ దేవస్థానం పాలకమండలి తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. అందుకు భిన్నంగా పాలకమండలి తీర్మానం లేకుండానే కేటాయింపు తంతును కానిచ్చేస్తున్నారు. మధురవాడలోని సింహాచలం దేవస్థానానికి చెందిన 50 ఎకరాలు లీజుపై కావాలని దేవాదాయ శాఖకు ఈ-సెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్‌కి చెందిన ‘పారాడిగం నాలెడ్జ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ దరఖాస్తు చేసుకుంది. దీనిపై దేవాదాయ శాఖ దరఖాస్తు చేసిన కంపెనీ పూర్వాపరాలను తెలియజేయాల్సిందిగా ఐటీ శాఖను కోరింది. ఈమేరకు ఐటీ శాఖ కంపెనీపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా 50 ఎకరాలను ఈ-సెంట్రిక్ సొల్యూషన్కు కట్టపెడుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుపై కేటాయించిన పక్షంలో ఆ భూమి మార్కెట్ విలువలో పది శాతం మేర లీజు నిర్ధారించాలని భూముల కేటాయింపు విధానంలో స్పష్టంగా ఉంది. దీనిప్రకారం సింహాద్రి అప్పన్నకు చెందిన 50 ఎకరాలు లీజుకు ఇచ్చినా ఏడాదికి రూ.25 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖలోని సెంట్రల్ జైలు కోసం సింహాచలం దేవస్థానానికి చెందిన 100 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది. అయితే, దేవస్థానం ఆ భూమికి బదులుగా ఇంకో చోట వంద ఎకరాలు కేటాయించాలంటూ సుదీర్ఘ పోరాటం చేసింది. ఆ పోరాట ఫలితంగా మధురవాడలో 100 ఎకరాలను గతంలో ప్రభుత్వం సింహాచలం దేవస్థానికి కేటాయించింది. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన మధురవాడలోని 50 ఎకరాల భూమిని కారు చౌకగా ఐటీ కంపెనీ కోసం కేటాయిస్తున్నారు. -
భక్తులకు క్షవరమే..
టికెట్‌తో పాటు అదనపు వసూళ్లు చేస్తున్న క్షురకులు అప్పన్న భక్తుల నిరసన పట్టించుకోని దేవస్థానం అధికారులు సింహాచలం : మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి క్షురకులు అదనంగా సొమ్ము డిమాండ్ చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామికి తలనీలాలు సమర్పించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సింహగిరికి తరలి వస్తుంటారు. వీరంతా దేవస్థానం విక్రయించే రూ.10 టికెట్ కొంటారు. ఈ సొమ్ములో రూ.5 ఆలయానికి, మరో రూ.5 కాంట్రాక్టు క్షురకులకు వెళ్తుంది.కేశఖండనశాలలో దేవస్థానానికి చెందిన శాశ్వత ఉద్యోగులు ఏడుగురు మినహాయిస్తే 63 మంది వరకు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తుంటారు. వీరిలో కొంతమంది క్షురకులు తలనీలాలు తీసిన తర్వాత నగదు డిమాండ్ చేస్తుండటంపై భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమశక్తిననుసరించి భక్తులు ఐదో, పదో అదనంగా బహుమతిగా చేతిలో పెడితే క్షురకులు తీసుకోకుండా రూ. 20కి తక్కువ కాకుండా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో భక్తులు అవాక్కవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందయినా వారడిగింది ఇవ్వవలసి వస్తోంది. ఈ సంఘటనలపై దేవస్థానం అధికారులకు గతంలో పలువురు భక్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వచ్చేనెల 1 నుంచి తలనీలాల టికెట్ 15 రూపాయలకు దేవస్థానం పెంచింది. ఈ మొత్తంలో రూ. 10 క్షురకులకు, రూ. 5 దేవస్థానానికి వచ్చేలా నిర్దేశించింది. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాతైనా క్షురకులు తమ నుంచి నగదు డిమాండ్ చేసే పద్ధతి విడనాడాలని పలువురు భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
అప్పన్న కల్యాణోత్సవం నేడే
సాయంత్రం 4 గంటలకు కొట్నాలు ఉత్సవం రాత్రి 7 గంటల నుంచి ధ్వజారోహణం 8గంటల నుంచి ఎదురు సన్నాహం 9 గంటల నుంచి రథోత్సవం 10.30 నుంచి కల్యాణం విస్తృత ఏర్పాట్లు సింహాచలం, న్యూస్‌లైన్ : చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం సింహాచలేశుడి వార్షిక కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. సింహగిరిపై ఉన్న నృసింహ మండపంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు అర్చకులు, ముత్తైవులు పసుపు కొమ్ములను శాస్త్రోక్తంగా దంచి కొట్నాలు ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు ధ్వజస్తంభం వద్ద దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల నుంచి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకిలో, ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు పల్లకిలో ఉంచి మాడ వీధుల్లో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేసి తొలి దర్శనాన్ని వ్యవస్థాపక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజుకు కల్పిస్తారు. రాత్రి 9 గంటల నుంచి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 10.30 గంటల నుంచి నృసింహ మండపంలో ప్రత్యేక వేదికపై కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. విస్తృత ఏర్పాట్లు : రథోత్సవం, కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు విస్తృత ఏ ర్పాట్లు చేశారు. నృసింహ మండపంలో భారీ కల్యాణవేదికను ఏర్పాటు చేశా రు. సుమారు 20 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు నృసింహ మండపం నాలుగు గేట్లలో ముత్యాల తలంబ్రాలు ఇవ్వనున్నారు.