16 నుంచి బలిజ శంఖారావం | balija samkaravam 16th | Sakshi
Sakshi News home page

16 నుంచి బలిజ శంఖారావం

Published Sat, Nov 12 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

balija samkaravam 16th

కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : 
అఖిల భారత కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు చలమశెట్టి రామానుజయ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి బలిజ శంఖారావడం పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నట్టు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నరహరిశెట్టి శ్రీహరి తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఒక హోటల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 నుంచి 20 నిర్వహించే ఈ యాత్ర ఇడుపులపాయ నుంచి కడప వరకూ జరుగుతుందన్నారు.  ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాదయాత్రను 15న విజయవాడలో ప్రారంభిస్తారని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో పర్యటించి కాపు, బలిజలను సంఘటితం చేస్తామన్నారు. పాదయాత్ర వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాబత్తుల శ్రీనివాస్, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు అడపా మాళవిక, నూజివీడు మహిళా నాయకురాలు లక్ష్మిగౌరీశ్వరి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు పద్మారావు, వి.వి.ఎస్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు.  
 

Advertisement

పోల్

Advertisement