సింహాచలం: సింహగిరి గ్రామదేవతలు పాదాలమ్మ, బంగారమ్మ పండుగ మహోత్సవాన్ని ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తొలేళ్ల ఉత్సవం, 26 సాయంత్రం నుంచి రాత్రి వరకు అనుపు మహోత్సవం జరుగుతుందన్నారు.
26న పాదాలమ్మ, బంగారమ్మ పండుగ
Published Sun, Jul 24 2016 12:56 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
26న అప్పన్న దర్శనాలు
మధ్యాహ్నం 2.30 గంటల వరకే...
సింహగిరి గ్రామదేవతలు పాదాలమ్మ, బంగారమ్మ పండుగను పురస్కరించుకుని ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల వరకే సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి దర్శనాలు లభిస్తాయని ఈవో తెలిపారు.
Advertisement
Advertisement