అర్హులకు బ్యాంకుల చేయూత
Published Sat, Oct 8 2016 12:05 AM | Last Updated on Sat, Jun 2 2018 5:51 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అర్హులకు బ్యాంకులు చేయూతనిస్తాయని ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం జేఎన్‌ఆర్ ప్రసాద్ చెప్పారు. శుక్రవారం స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో నిర్వహించిన జిల్లాలోని ప్రధాన బ్యాంకుల ఆర్థిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి రుణాలు అందచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆధార్ లేనివారికి ఆధార్ కార్డు జారీ చేస్తామని, బ్యాంక్ ఖాతా లేనివారికి ఎకౌంట్ తెరిచి లబ్ధిదారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా బ్యాంకుల అవగాహన మేళాను ఈ నెల 14న భీమవరంలో, 18న తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తామని, లబ్ధిదారులు ఈ మేళాలకు హాజరుకావచ్చన్నారు. కాగా ఈ కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి ఈ నెల 31 వరకూ అన్ని బ్యాంకుల్లో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు మునిసిపల్ కమిషనర్ ఎస్.హనుమంతరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement