సోమందేపల్లి : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్‌కు వ్యతిరేకంగా అసమ్మతి లేవనెత్తిన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ తదితరులతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు చర్చలు జరిపారు. పరిగి జెడ్పీటీసీ ఽసభ్యుడు సూర్యనారాయణ కుమారుడి వివాహం శనివారం రాత్రి సోమందేపల్లిలో జరిగింది. ఈ వేడుకకు హాజరైన బీకే, కాలవ స్థానిక వెంకటేశ్వర కల్యాణ మంటపంలో అసమ్మతి నేతలతో అరగంట పాటు చర్చించారు. అయితే.. పీఏ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిఽసింది.