హైనా దాడిలో లేగదూడ మృతి | catle died in haina dash | Sakshi
Sakshi News home page

హైనా దాడిలో లేగదూడ మృతి

Published Fri, Sep 30 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

catle died in haina dash

వనపర్తి రూరల్‌ : హైనా దాడి చేయడంతో ఓ లేగదూడ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. వనపర్తి మండలంలోని అంజనగిరికి చెందిన మన్నెం వృత్తిరీత్యా రైతు. ఎప్పటిలాగే తమకున్న పశువులను గురువారం సాయంత్రం గట్టు పక్కన ఉన్న పొలంలోని పాకలో వాటిని కట్టి ఇంటికి వచ్చాడు.
 
శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా ఓ లేగదూడ చనిపోయి ఉంది. దాని గొంతు వద్ద ఘాట్లు ఉంyì  శరీరం నుంచి అవయవాలు బయటకు రావడంతో వెంటనే అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సంఘటన స్థలాన్ని ఎఫ్‌ఆర్‌ఓ అబ్రహం పరిశీలించి హైనా దాడిలో దూడ చనిపోయినట్టు నిర్ధారించారు.