హ్యాండ్లూమ్‌ పార్క్‌ పరిశీలన | checking the handloom park | Sakshi
Sakshi News home page

హ్యాండ్లూమ్‌ పార్క్‌ పరిశీలన

Published Tue, Sep 27 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

హ్యాండ్లూమ్‌ పార్క్‌ పరిశీలన

హ్యాండ్లూమ్‌ పార్క్‌ పరిశీలన

భూదాన్‌పోచంపల్లి: చేనేత రంగానికి పూర్వౖవైభవం తీసుకరావడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తుందని కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రష్మివర్మ తెలిపారు. మంగళవారం మండలంలోని కనుముకుల పరిధిలోని పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్‌లో తయారవుతున్న చేనేత వస్త్రాలు, కార్మికులకు లభిస్తున్న కూలీ, మార్కెటింగ్, నిర్వహణను పరిశీలించారు. హ్యాండ్లూమ్‌ పార్క్‌ పునరుద్ధరణ కోసం నిధులు కావాలని కేంద్రానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పార్క్‌ పాలకవర్గంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పార్క్‌లో తయారవుతున్న వస్త్రాల టర్నోవర్, పనిచేస్తున్న కార్మికులు, దేశ, విదేశాలకు అవుతున్న ఎగుమతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ చేనేత పథకాల అమలు తీరును పరిశీలించడానికి వచ్చామని తెలిపారు. ఇందులో భాగంగానే హ్యాండ్లూమ్‌ పార్క్‌ను సందర్శించినట్లు తెలిపారు. ఆమె వెంట హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ అలోక్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్‌ డైరెక్టర్‌ ప్రీతిమీనా, జాయింట్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌రావు, ఎన్‌హెచ్‌డీసీ డైరెక్టర్‌ బంధోపాధ్యాయ, హైదరాబాద్‌ వీవర్స్‌ సర్వీస్‌సెంటర్‌ ఏడీ హిమజకుమార్, టి. సత్యనారాయణరెడ్డి, పార్క్‌ చైర్మన్‌ కడవేరు దేవేందర్, డైరెక్టర్లు చిక్క కృష్ణ, భారత లవకుమార్, సీత దామోదర్, చిట్టిపోలు గోవర్దన్, భారత పురుషోత్తం పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement