‘లెక్క’ చెప్పేదెవరు?
సర్కారు బడి లెక్కతప్పింది. 6, 7 తరగతులకు గణితం బోధన విషయంలో చిక్కుముడి ఏర్పడింది. ఫిజిక్స్ టీచర్లే గణిత పాఠాలు చెప్పాలని లెక్కల మాస్టార్లు.. అది మా బాధ్యత కాదని ఫిజిక్స్ టీచర్లు చేతులు దులుపుకుంటుండడంతో వార్షిక క్యాలెండర్ సైతం తయారు చేయలేకపోయారు. లెక్కల పాఠాల విషయంలో ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్ల మధ్య వివాదంతో విద్యార్థులు నష్టపోతున్నారు.
సాక్షి, కామారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7 తరగతుల విద్యార్థులకు గణితం బోధించడంపై గందరగోళం నెలకొంది. ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్ల మధ్య రగులుతున్న సమస్య విద్యార్థులకు శాపంగా మారింది. ఉన్నత పాఠశాలల్లో íఫిజిక్స్, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ రెం డు సబ్జెక్టులు కీలకమైనవి కూడా. అయితే మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు 8, 9, 10 తరగతుల వారికి గణి తం బోధిస్తున్నారు.
కానీ 6, 7 తరగతుల వారికి మా త్రం చెప్పడం లేదు. ఇదేమంటే ఆ తరగతులకు ఫిజి కల్ సైన్స్ టీచర్లు లెక్కలు బోధించాల్సి ఉంటుందంటున్నారు. ఆ తరగతులు మావి కావంటే, మావికా వ ంటూ ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్లు చేతులెత్తేస్తుండడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచోరంగా మారింది. గతేడాది వివాదం కారణంగా విద్యార్థులు నష్టపోయారు.
వివాదం ఇలా..
ఉన్నత పాఠశాలల్లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ స్కూల్ అసిస్టెంట్ల మధ్య బోధనకు సంబంధించి కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. అయితే గతేడాది ఫిజికల్ సైన్స్ టీచర్లు 6, 7 తరగýతుల బోధన బాధ్యతను మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లకే అప్పగించాలని ప్రభుత్వానికి విన్నవించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆర్‌సీ 77 ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏడో తరగతికి మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు, ఆరో తరగతికి ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లు గణితం బోధించాలని పేర్కొన్నారు. దీనిపై మ్యాథ్స్ టీచర్లు విద్యాశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ డైరెక్టర్ తన ఆదేశాలను పక్కన పెట్టాలని డీఈవోలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే 6, 7 తరగతులకు గణితం ఎవరు బోధించాలన్న పంచాయతీ మాత్రం తేల్చలేదు.
గతేడాది కొన్నిచోట్ల గణిత పాఠాలు ఎవరూ చెప్పకపోవడంతో విద్యార్థులు నష్టపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. చాలా పాఠశాలల్లో 6, 7 తరగతులకు గణితం బోధన మాది కాదంటే మాది కాదంటూ అటు మ్యాథ్స్ టీచర్లు, ఇటు ఫిజికల్ సైన్స్ టీచర్లు చేతులెత్తేస్తుండడంతో విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది.
వార్షిక క్యాలెండర్ ఏదీ?
విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యాశాఖ ముందుగానే వార్షిక క్యాలెండర్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈసారి విద్యాసంవత్సరం మార్చి 21నే ప్రారంభమైంది. వేసవి సెలవుల వరకు పాఠశాలలు కొనసాగాయి. అయితే కనీసం బడులు పునఃప్రారంభమయ్యేలోపైనా వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయలేదు. పాఠశాలలు తెరిచి నెల గడిచినా వార్షిక క్యాలెం డర్ మాత్రం వెలువడలేదు. 6, 7 తరగతులకు సం బంధించిన గణిత బోధన విషయంలో క్యాలెండర్ వె లువడి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు 6, 7 తరగతులకు సం బంధించిన గణిత బోధన విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం వార్షిక క్యాలెండర్‌ను రూ పొందిస్తే.. ఉపాధ్యాయులు ఆయా తరగతులకు గణిత పాఠాలు బోధిస్తారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.