
లండన్: బ్రిటన్ విద్యార్థులకు 18 ఏళ్లు వచ్చేదాకా గణిత బోధన ఖచ్చితంగా ఉండాలని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. ‘ 18 ఏళ్లు వచ్చేవరకు ప్రతి ఏటా గణితం చదవాల్సిందేననే నిబంధన బ్రిటన్‌లో ఇన్నాళ్లూ లేదు. ఇకపై అలా కుదరదు. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రపంచంలో ఏ ఉద్యోగం చూసినా డేటా, గణాంకాలతో ముడిపడి ఉంది. విద్యా వ్యవస్థకు గణితమే ప్రధాన భూమిక.
అలాంటి విభాగంలో బ్రిటన్ విద్యార్థులు వెనుకంజ వేయొద్దు. గణితం నేర్వాల్సిందే’ అని కొత్త ఏడాదిలో చేసిన తొలి ప్రసంగంలో సునాక్ స్పష్టంచేశారు. గణితం బోధనను తప్పనిసరి చేసేలా నిబంధనలను మార్చుతామని ప్రధాని చెప్పారని ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, బ్రిటన్‌లో చాన్నాళ్లుగా గణిత బోధకుల తీవ్ర కొరత ఉందని ది అసోసియేషన్ ఆఫ్ స్కూల్, కాలేజ్ లీడర్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment