ఇనుగుర్తి మండల ఏర్పాటుకు సహకరించండి | Contribute to the creation of the inugurti mandal | Sakshi
Sakshi News home page

ఇనుగుర్తి మండల ఏర్పాటుకు సహకరించండి

Published Thu, Sep 15 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

Contribute to the creation of the inugurti mandal

  • ఎమ్మెల్యే శంకర్‌నాయక్,టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు  
  • ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో సమావేశం 
  • కేసముద్రం : ఇనుగుర్తి గ్రామానికి మంచి స్వరూపం ఉందని, ఆ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సహకరించాలని మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవిందర్‌రావు కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం పలు గ్రామాల ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇనుగుర్తి మండల ఏర్పాటుపై వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసమే కేసీఆర్‌ కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఇనుగుర్తి మండల ఏర్పాటుకు ఎవరూ అడ్డుపడవద్దన్నారు.  
     
    నారాయణపురం సర్పంచ్‌ ఊకంటి యాకుబ్‌రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామాన్ని ఇనుగుర్తి మండలంలో కలపడానికి గ్రామస్తులు అంగీకరించడం లేదని, తమను అనవసరంగా బదనాం చేస్తున్నారని అన్నారు. దీంతో ఆయనకు, ఇనుగుర్తి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. వారిని శంకర్‌నాయక్, రవీందర్‌రావు సముదాయించారు. అమీనాపురం, నారాయణపురం గ్రామాలను కేసముద్రంలోనే ఉంచేలా పూర్తిస్తాయిలో కృషిచేస్తామని వారు హామీ ఇచ్చారు. మొత్తం 13 గ్రామాలలో మహముద్‌పట్నం, అమీనాపురం, నారాయణపురం గ్రామాల వారు అభ్యంతరం చెప్పారు. మిగిలిన గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు సానూకూలంగా స్పందించారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిర రాధిక, మానుకోట ఆర్డీఓ భాస్కర్‌రావు, ఎంపీడీవో అరుణాదేవి, గాయత్రి గ్రానైట్‌ అధినేత వద్దిరాజు రవిచంద్ర, ధన్నసరి, కేసముద్రం పీఏసీఎస్‌ చైర్మlHలు బండారు వెంకన్న, గడ్డం యాకమూర్తి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఊకంటి యాకూబ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

పోల్

Advertisement