త్వరలో వైద్యుల పోస్టుల భర్తీ
త్వరలో వైద్యుల పోస్టుల భర్తీ
Published Tue, Sep 13 2016 6:08 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
హుకుంపేట(గోపాలపురం): జిల్లాలో త్వరలో వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) కె.కోటేశ్వరి చెప్పారు. మండలంలోని హుకుంపేట ప్రాథమిక వైద్యశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో డాక్టర్ల కొరత వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి వైద్యులు నిరాకరించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. హుకుంపేట పీహెచ్‌సీకి శాశ్వత వైద్యులు, స్టాఫ్‌నర్స్, సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమిస్తామని చెప్పారు. ముందుగా పోలవరం నిర్వాసితులు పైడిపాక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. కె.నాగేశ్వరావు, పీడీఆర్ కె.స్వామి, సత్యవతి, త్రిమూర్తులు ఆమె వెంట ఉన్నారు.
Advertisement
Advertisement