ఈ ఏడాది తెప్పిస్తా
పులివెందుల రూరల్ :
గతంలో కంటే ఈ ఏడాది పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు (పీబీసీ) అధికంగా నీరు తెప్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వేముల మండలం సిద్ధంరెడ్డిపల్లెకు చెందిన గంగులయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పీబీసీకి తుంగభద్ర, కృష్ణా జలాలు రానున్నాయన్నారు. కృష్ణ జలాలు కర్నూలు జిల్లాలోని ఎత్తిపోతల పథకం నుంచి అనంతపురంలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ ద్వారా జీడిపల్లె రిజర్వాయర్‌కు తరలించి అక్కడ నుంచి సీబీఆర్‌కు నీరు తెప్పించేందుకు కృషి చేస్తున్నారు. దీంతోపాటు గండికోట నుంచి పైడిపాలెం, సీబీఆర్ డ్యాంకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. సాగు, తాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మెన్ రాఘవరెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.