cm relif fund
-
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ బౌన్స్
సాక్షి, కర్నూలు : ఓట్ల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌ను టీడీపీ రిలీఫ్ ఫండ్‌గా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గొప్ప కోసం ఉత్త చెక్కులు ఇచ్చి బాధితుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం 19వ వార్డుకు చెందిన గంగాధర్ రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. చిరుద్యోగి అయిన గంగాధర్ రెడ్డి భార్య జ్యోతి ఆపరేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 26 వేల చెక్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నికల రెండు రోజుల ముందు(ఏప్రిల్ 9న) టీడీపీ నేతలు ఈ చెక్‌ను గంగాధర్‌కు అందజేశారు. ఈ చెక్‌ను బ్యాంకుకు తీసుకెళ్లగా అకౌంట్లో సరిపడ నిధులు లేకపోవడం వల్ల చెక్‌ను రిజెక్టు చేస్తున్నామని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పింది. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో మోసం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయిన సంగతి తెలిసిందే. -
భారత వైమానిక సంస్థ భారీ విరాళం
తిరువనంతపురం: కేరళ వరద బాధితుల సహాయార్ధం భారత వైమానిక సంస్థ భారీ విరాళాన్ని అందించింది. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళ వాసులను భారీగా సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సంస్థ తాజాగా ఆర్ధిక సహాయాన్ని కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం వరద సహాయనిధికి 20కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. సీఎం డిస్ట్రస్ రిలీఫ్ ఫండ్ (సీఎండీఆర్ఎఫ్) చెక్‌ను శనివారం ఐఏఎఫ్ అందించింది. కేరళ అంతటా వరద తుఫాను ప్రాంతాల్లో ఒక వారం పాటు కొనసాగిన రెస్క్యూ కార్యక్రమాలలో పాల్గొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాధితుల పునరావాస కార్యక్రమాలకోసం ఈ భారీ విరాళాన్ని ప్రకటించింది. తిరువనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయ్ను కలిసిన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, సౌత్ ఎయిర్ కమాండ్, ఎయిర్ మార్షల్ బి సురేష్ బృందం ఈ చెక్‌ను అందజేసింది. -
ఈ ఏడాది తెప్పిస్తా
పులివెందుల రూరల్ : గతంలో కంటే ఈ ఏడాది పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు (పీబీసీ) అధికంగా నీరు తెప్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో వేముల మండలం సిద్ధంరెడ్డిపల్లెకు చెందిన గంగులయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పీబీసీకి తుంగభద్ర, కృష్ణా జలాలు రానున్నాయన్నారు. కృష్ణ జలాలు కర్నూలు జిల్లాలోని ఎత్తిపోతల పథకం నుంచి అనంతపురంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా జీడిపల్లె రిజర్వాయర్‌కు తరలించి అక్కడ నుంచి సీబీఆర్‌కు నీరు తెప్పించేందుకు కృషి చేస్తున్నారు. దీంతోపాటు గండికోట నుంచి పైడిపాలెం, సీబీఆర్ డ్యాంకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. సాగు, తాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మెన్ రాఘవరెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.