జయశంకర్ సార్ చిరస్మరణీయుడు
► తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు కృషిచేశారు : దుబ్బాక
► ప్రొఫెసర్‌కు పలువురి నివాళి
నల్లగొండ కల్చరల్ :
తెలంగాణ సిద్ధాంతకర్త ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ చిరస్మరణీయుడని టీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్థానిక టౌన్‌హాల్ దగ్గర నిర్వహించిన ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ 6 వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణే ఊపిరిగా శ్యాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్‌కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని తెలిపారు.
ప్రభుత్వ ప్లీడర్ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యమ గురువుగా తెలంగాణ భావవ్యాప్తిలో జయశంకర్‌సార్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులను ఉద్యమంలోకి తీసుకరావడంలో కీలకపాత్ర వహించాడన్నారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు భోనగిరి దేవేందర్ మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమానికి సాక్షంగా జయశంకర్‌సార్ నిలుస్తాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట– నల్లగొండ జిల్లాల స్త్రీ శిశు సంక్షేమ ఆర్గనైజర్ మాలె శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేఖల భద్రాద్రి, గోలి అమరేందర్‌రెడ్డి, బొర్ర సుధాకర్, ఫరీదుద్దీన్, మైనం శ్రీను, అబ్బగోని రమేష్, బక్కతట్ల వెంకట్, బొమ్ము శంకర్, మేక విఘ్నేశ్వర్, తుమ్మనగోటి వెంకట్, బట్టు నవీన్, మదన్, నరేష్, శ్రీకాంత్, రవి, తదితరులున్నారు.
ప్రొఫెసర్ కృషి మరువలేనిది..
తిప్పర్తి : తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం సాధనలో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ కృషి మరువలేనిదని జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్ అన్నారు. ఫ్రొఫెసర్ జయశంకర్‌సార్ 6వ వర్ధంతి సందర్భంగా స్థానిక జెడ్పీటీసీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్ మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో నిత్యం అందరినీ చైతన్య పరిచి తెలంగాణలో చిరస్మరనీయుడిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి రవీందర్, శంకర్, జానయ్య, సైదులు, రంగారెడ్డి, కోండయ్య, రాము, కపిల్ తదితరులు పాల్గొన్నారు.
టీవీవీ ఆధ్వర్యంలో..
నల్లగొండ టౌన్ : ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ 6వ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) ఆధ్వర్యంలో కొవ్వోత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీవీవీ జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు మాట్లాడు తూ అభివృద్ధి ప్రజల కేంద్రంగా జరగడం జయశంకర్ ఆశయమన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి వి.కొండల్, బి.కేశవులు, ఎన్.వెంకన్న, కట్టా సైదులు, వెంకట్‌రెడ్డి, గిరి, లింగస్వామి, బత్తుల లింగయ్య పాల్గొన్నారు.