లోక్ అదాలత్ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం
లోక్ అదాలత్‌లో ప్రథమ స్థానంలో నిలవాలి
Published Tue, Oct 4 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
శ్రీకాకుళం సిటీ : లోక్ అదాలత్ ద్వారా కేసులను సత్వరం పరిష్కరించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు వీబీ నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ భవనంలో ఎనిమిదో జాతీయ లోక్ అదాలత్ వాల్‌పోస్టర్‌ను తోటి న్యాయమూర్తులతో కలిసి మంగళవారం ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడో జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1350 కేసులను పరిష్కరించినట్టు చెప్పారు. కేసులను పరిష్కరించడంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా నాల్గో స్థానంలో ఉందని, ప్రథమ స్థానంలో నిలిచేందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు.
ఈ నెల 8న జరగనున్న ఎనిమిదో జాతీయ లోక్ అదాలత్ ద్వారా అన్ని రకాల కేసులతో పాటు ట్రాఫిక్, మున్సిపల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సెక్షన్–138 నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంటు యాక్టు కేసులు, రికవరీ సూట్లు, మోటారు యాక్సిడెంట్ క్లయిం కేసులు, సివిల్, రెవెన్యూ, ప్రభుత్వ భూసేకరణ, ప్రీలిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కేసులన్నీ న్యాయ సేవాసదన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా కోర్టుల సముదాయంతో పాటు జిల్లాలోని ఇతర కోర్టు సముదాయాలతో నిర్వహించనున్నట్టు తెలిపారు. కక్షిదారులు పెద్ద ఎత్తున పాల్గొని రాజీమార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.మేరీగ్రేస్ కుమారి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె.సుధారాణి, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ షేక్ ఇంతియాజ్ అహ్మద్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి పి.రాజేంద్రప్రసాద్, ఎక్సైజ్ మేజిస్ట్రేట్ వై. శ్రీనివాసరావు, మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ పి.సాయిసుధ, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగు కృష్ణారావు, ఉపాధ్యక్షుడు మామిడి క్రాంతి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement