రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | Government's aim is for the welfare farmer | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Published Tue, Dec 13 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

Government's aim is for the welfare farmer

సూర్యాపేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర విద్యుత్, ఎస్సీకులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో, సూర్యాపేట మండలం రామచంద్రాపురం, అనంతగిరి మండలం చనుపల్లి, మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం, నేలమర్రి, ఆత్మకూర్‌ ఎస్‌ మండలం నెమ్మికల్‌ గ్రామాల్లో నిర్మించిన 33/11 సబ్‌స్టేషన్లను సోమవారం ఆయన ప్రారంభించారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న కరెంటు కష్టాలను.. ఇక నూతనంగా ఏర్పాటైన రాష్ట్రంలో తొలగించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారన్నారు. అదే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేలకు పైగా సబ్‌స్టేషన్‌లను నిర్మించినట్లు చెప్పారు. ఈ సబ్‌స్టేషన్ల ద్వారా రైతులు సాగుచేస్తున్న పంట పొలాలకు నిరంతరాయంగా తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే కేసీఆర్‌ లక్ష్యమన్నారు. రాష్ట్రం ఏర్పాటై అధికారం చేపట్టిన నాటి నుంచే సీఎం కేసీఆర్‌ రైతులపై దృష్టి సారించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక, ఆర్డీఓ గోపాలరావు, ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాసులు, తహసీల్దార్‌ మహమూద్‌అలీ, వైస్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్లలక్ష్మి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కట్కూరి గన్నారెడ్డి, వైవి, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, ఉప్పల ఆనంద్, బైరు దుర్గయ్యగౌడ్, షేక్‌ తాహేర్‌పాషా, పుట్ట కిషోర్, కొండపల్లి దిలీప్‌రెడ్డి, కోడి సైదులుయాదవ్, రమాకిరణ్‌గౌడ్, పాండు, నర్సింహ్మరావు, నర్సింహ, ట్రాన్స్‌కో ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement