Minister guntakandla jagadish reddy
-
టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ
అర్వపల్లి (తుంగతుర్తి) : బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జాజిరెడ్డిగూడెంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని గ్రహించిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మొరిశెట్టి ఉపేందర్, మాజీ ఎంపీపీ మీలా చంద్రకళ, పీఏసీఎస్ చైర్మన్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి, దండ వీరారెడ్డి, మీలా కిష్టయ్య, కాపా వెంకటేశ్వర్రావు, కె.సోమిరెడ్డి, పెద్దయ్య, భూమయ్య, కుంభం నర్సయ్య, లింగమల్లు, రాంమ్మల్లు, అనిరెడ్డి శేఖర్‌రెడ్డి, దోరేపల్లి వెంకటయ్య ఉన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎల్.కిషన్‌రావు, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మొరిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, మార్కెట్ చైర్పర్సన్ పాశం విజయయాదవరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కుంట్ల సురేందర్‌రెడ్డి, అంబయ్య, దావుల వీరప్రసాద్, పాశం యాదవరెడ్డి, బి.రామలింగయ్య, ఎర్రనర్సయ్య, వైస్ ఎంపీపీ వెంకన్న, సర్పంచ్‌లు ప్రమీల, జీడి వీరస్వామి, వి.గంగయ్య, మన్నె లక్ష్మినర్సు, పద్మ, మామిడి సోమయ్య, మామిడి సత్యనారాయణ, హరిప్రసాద్, కె. మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నకిరేకల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని రాష్ట్ర విద్యుత్, షెడ్యూల్ కులాల శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నకిరేకల్‌లోని నారాయణరెడ్డి ఫంక్షన్హాల్లో నకిరేకల్, కట్టంగూర్, చిట్యాల, మండలాల్లో కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిపొందిన 86మందికి రూ.51వేల చొప్పున రూ.43.86లక్షలు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణలక్షి పథకం ఎన్నికల హామీ కాదు..ఎవ్వరు కూడా అడగలేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందన్నారు. ఈ పథకం ద్వారా ఏ ఇంట్లో కూడా ఆడపిల్ల పుట్టిన మనింటికి కళ్యాణ లక్ష్మి వస్తుందని అనుకోవాలని సూచించారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలో కల్యాణ లక్ష్మి కింద 2500 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మొదటి విడుతలో 1300మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. రెండవ విడుతలో కూడా మిగితా వారికి చెక్కులు ఇస్తామన్నారు. ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారణ, శిశువిక్రయాలకు వ్యతిరేకంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతామన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిల కోసం సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరుతో రూ.51వేలు ఇవ్వడం గొప్పవిషయం అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఆడపిల్లల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఒక పెద్దకొడుకులాగా ఉండి వారి వివాహాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. నల్లగొండ ఆర్డీఓ వెంకటచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేసీ నారాయణరెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ సుజాత యాదయ్య, ఎంపీపీలు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, గుత్త మంజుల, కొండ లింగస్వామి, జెడ్పీటీసీలు పెండెం ధనలక్ష్మి సదానందం, శేపూరి రవీందర్, తహసీల్దార్లు అంబేద్కర్, ప్రమీళ, పుష్పలత, సర్పంచ్‌లు పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, దుబ్బాక మంగమ్మ, ఎంపీటీసీలు రాచకొండ వెంకన్న, సైదారెడ్డి, మమత, సరిత తదితరులు ఉన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సూర్యాపేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర విద్యుత్, ఎస్సీకులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో, సూర్యాపేట మండలం రామచంద్రాపురం, అనంతగిరి మండలం చనుపల్లి, మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం, నేలమర్రి, ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ గ్రామాల్లో నిర్మించిన 33/11 సబ్స్టేషన్లను సోమవారం ఆయన ప్రారంభించారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న కరెంటు కష్టాలను.. ఇక నూతనంగా ఏర్పాటైన రాష్ట్రంలో తొలగించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. అదే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేలకు పైగా సబ్స్టేషన్లను నిర్మించినట్లు చెప్పారు. ఈ సబ్స్టేషన్ల ద్వారా రైతులు సాగుచేస్తున్న పంట పొలాలకు నిరంతరాయంగా తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్రం ఏర్పాటై అధికారం చేపట్టిన నాటి నుంచే సీఎం కేసీఆర్ రైతులపై దృష్టి సారించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, ఆర్డీఓ గోపాలరావు, ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాసులు, తహసీల్దార్ మహమూద్‌అలీ, వైస్ చైర్పర్సన్ నేరెళ్లలక్ష్మి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కట్కూరి గన్నారెడ్డి, వైవి, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, ఉప్పల ఆనంద్, బైరు దుర్గయ్యగౌడ్, షేక్ తాహేర్‌పాషా, పుట్ట కిషోర్, కొండపల్లి దిలీప్‌రెడ్డి, కోడి సైదులుయాదవ్, రమాకిరణ్‌గౌడ్, పాండు, నర్సింహ్మరావు, నర్సింహ, ట్రాన్స్‌కో ఏఈలు తదితరులు పాల్గొన్నారు.