అనంతపురం సప్తగిరి సర్కిల్ : క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలకు పూర్వ వైభవం తెస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలను ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందన్నారు.
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షిమాలిక్, శ్రీకాంత్‌లను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. టేబుల్‌టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ ద్వారా జిల్లాకు ఎంతో మంది క్రీడాకారులను పరిచయం చేసిన టోర్నీ నిర్వాహకుల కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ షకీల్‌షఫీ, టేబుల్‌టెన్నిస్ జిల్లా అధ్యక్షుడు డా అక్బర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మురళీధర్ రావు, ట్రెజరర్ పాండు, కార్యదర్శి కేశవరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి, అరుణ్, సూర్యారావు, రాజేష్ పాల్గొన్నారు.
విజేతలు వీరే
మినీ క్యాడెట్ బాలికలు విన్నర్‌్స రన్నర్స్‡
దోహ మోహితా గాయిత్రి
మినీక్యాడెట్ బాలురు ప్రణవ్ అశ్విన్‌సాయి
క్యాడెట్ బాలికలు హాసిని శ్రేష్ట
క్యాడెట్ బాలురు ఎం.వీ. కార్తికేయ ఖుష్ జైన్
సబ్ జూనియర్ బాలికలు ఆర్.కాజోల్ మహిత చౌదరి
సబ్ జూనియర్ బాలురు సాయి దీపక్ అక్షిత్
జూనియర్స్ బాలికలు కాజోల్ అనూషరెడ్డి
జూనియర్స్ బాలురు సాయి స్వరూప్ జయసూర్య
యూత్ బాలికల విభాగం కాజోల్ నాగశ్రావణి
యూత్ బాలుర విభాగం జగదీష్ కృష్ణ మోహిత్ శర్మ
బాలికల విభాగం కాజోల్ నాగ శ్రావణి
బాలుర విభాగం జగదీష్ కృష్ణ ఉమేష్ కుమార్
వెటరన్స్ (50 + విభాగం) అక్బర్ సాహెబ్ కేశవరెడ్డి
వెటరన్స్ (40 + విభాగం) రవికుమార ప్రకాష్
క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం
Published Mon, Sep 12 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
Advertisement
Advertisement