తిరుమలలో భారీ వర్షం
సాక్షి, తిరుమల: తిరుమలలో గురువారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు గంటపాటు కురిసింది. ఆలయ ప్రాంగణం జలమయమైంది. వర్షం నీటితో నిండింది. ముందు జాగ్రత్తగా ఫైరింజన్లు తెప్పించారు. శ్రీవారిని దర్శించుకుని వెలుపల వచ్చిన భక్తులు తడుస్తూ వెళ్లడం కనిపించింది. రెండు ఘాట్‌రోడ్లలో కూడా వర్షం భారీ స్థాయిలో కురిసింది.