మార్కాపురం పీఎస్ వద్ద ఉద్రిక్తత! | high tension at markapur police station | Sakshi

మార్కాపురం పీఎస్ వద్ద ఉద్రిక్తత!

Jun 8 2016 12:26 PM | Updated on May 29 2018 2:26 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండేళ్ల చంద్రబాబు పాలనపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనపై కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా మార్కాపురం పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.

ఆ విషయం తెలిసి అప్పటికే టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని... టీడీపీ వారిని అక్కడ నుంచి పంపివేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ నాయకులు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement