పుట్టపర్తి అర్బన్ : మండలంలోని గంగిరెడ్డిపల్లి తండా వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మానాయక్ (50)గురువారం సాయంత్రం మృతి చెందినట్లు రూరల్ ఎస్‌ఐ రాఘవరెడ్డి తెలిపారు. గంగిరెడ్డిపల్లి తండాకు చెందిన లక్ష్మానాయక్ బుధవారం రాత్రి పెడపల్లి వైపు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో వెళ్తున్న సమయంలో ఓడీసీ మండలం కొండకమర్లవైపు నుంచి ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చిన ఎద్దుల గంగాద్రి అనే వ్యక్తి ఢీ కొన్నాడు. ప్రమాదంలో లక్ష్మానాయక్‌కు తలకు తీవ్ర గాయం కావడంతో కదిరి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెండాడు. అతడి కొడుకు రవీంద్రనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.