నేడు జాబ్ మేళా
Published Fri, Aug 26 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
ఏలూరు (మెట్రో) : విద్యార్హతలను బట్టి వివిధ కంపెనీల్లో నేరుగా ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్టు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27న శనివారం డీఆర్‌డీఏ, డీడీయూజీకెవై, ఇజీఎం ఆధ్వర్యంలో వట్లూరులోని టీటీడీసీ ప్రాంగణంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అపోలో హాస్పటల్‌లో 24 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు డీఎంఎల్‌టీ అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. వీరికి రూ. 7 వేల నుంచి రూ.10 వేల వరకు జీతం ఇస్తారన్నారు. ఐటీ టెక్నీషియన్స్ 24 పోస్టుల్లో బీఎస్సీ, బీటెక్, ఎంసీఏ కంప్యూటర్స్ అర్హత కలిగి 26 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు జీతం అందించి ఉద్యోగాన్ని కల్పిస్తారని తెలిపారు. ఈ ఉద్యోగ నియామకాలు జిల్లాలోనే చేపట్టనున్నట్టు వివరించారు. అదేవిధంగా నెల్లూరు శ్రీసిటీలో విధులు నిర్వహించేందుకు స్త్రీల కోసం 100 మొబైల్ ప్రొడక్షన్ ఆపరేటర్ ఉద్యోగాలకు రూ.7,500 జీతం ఇచ్చి వసతి కల్పించనున్నట్టు తెలిపారు. జిల్లాలోని పెదవేగి వహ్యాన్ కాఫీ లిమిటెడ్‌లో 2 క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగాలకు బీఎస్సీ కెమెస్ట్రీ అర్హత కలిగిన వారితో 35 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారికి రూ. 6 వేల నుంచి రూ.7 వేల జీతం ఇస్తారని, 2 సూపర్‌వైజర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారికి రూ.7 వేల జీతం ఇస్తారని, 10 ఆపరేటర్ పోస్టులకు ఐటీఐ ఫిట్టర్, ఎలక్రీ్టషియన్స్ అర్హత కలిగిన వారు ఈ ఎంపికలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, ఇతర వివరాలకు కె.రవీంద్రబాబు 8985906062 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని పీడీ శ్రీనివాస్ కోరారు.
Advertisement